India vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ఆ ప్లేయర్ ప్లేస్‌లో రిషబ్ పంత్..! టీమిండియా తుది జట్టు ఇలా..
India Playing 11 For Netherlands Match: పాకిస్థాన్‌పై అద్భుత విజయం తరువాత మరోపోరుకు టీమిండియా రెడీ అవుతోంది. పసికూన నెదర్లాండ్స్‌తో ఈ నెల 27న తలపడనుంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జట్టులో చోటు కల్పించడంపై చర్చ జరుగుతోంది.
India Playing 11 For Netherlands Match: దయాది పాకిస్థాన్‌పై మరుపురాని విజయంతో టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గ్రాండ్‌గా ఆరంభించింది. విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌కు హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో భారత్‌ను గెలిపించారు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించినా.. ఎన్నో లోపాలు బయటపడ్డాయి. తుది జట్టు ఎంపికపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.
పాకిస్థాన్ విధించిన 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగోస్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దురదృష్టవశాత్తూ అక్షర్ పటేల్ రనౌట్ కావడంతో ఈ ప్రయోగం ఫెయిలైంది. దీంతో లెఫ్ట్ హ్యాండర్ రిషభ్ పంత్‌ను తుది జట్టులో తీసుకోవాల్సిందని కొందరు వాదించారు. బౌలింగ్‌లో కూడా కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసిన అక్షర్.. 21 పరుగులు సమర్పించుకున్నాడు. తరువాత జరిగే మ్యాచ్‌లో అయినా అక్షర్ స్థానంలో రిషభ్‌ను టాప్-11లోకి తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.
ఈ నెల 27న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో భారత్ తలపడబోతుంది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ యోచిస్తున్నారు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ కీపింగ్ చేశాడు.
నెదర్లాండ్స్ తో తలపడబోయే మ్యాచ్‌లో పంత్‌ను తుదిజట్టులోకి తీసుకువస్తే.. ఐదో బౌలర్‌గా హర్ధిక్ పాండ్యా పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌గా బౌలింగ్ చేశాడు. 30 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా బ్యాటింగ్‌లోనూ 40 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 113 పరుగులు జోడించాడు. పాకిస్థాన్‌తో జరిగిన బంతితో ఆకట్టుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్టు (అంచనా):
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్లెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్/చాహల్.
Also Read: WhatsApp Back: బీ రిలాక్స్.. వాట్సాప్ ఈజ్ బ్యాక్
Also Read: Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి