Rohit Shamra On Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ అభిమానులను ఆద్యంతం అలరించింది. చివరి బంతి వరకు సాగిన ఫైట్‌లో ఐదు పరుగుల తేడాతో బంగ్లాను భారత్ ఓడించింది. ఈ విజయంతో టీమిండియా దాదాపు సెమీస్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియాకు ఇది మూడో విజయం. గ్రూప్-బి పాయింట్స్ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో  ఇక చివరి మ్యాచ్‌ను జింబాబ్వేతో తలపడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగ్లాపై విజయం సాధించిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. 'నేను ప్రశాంతంగా ఉన్నా కాస్తా నెర్వస్‌గా అనిపించింది. ఈ మ్యాచ్ మాకు చాలా ముఖ్యమైనది. మ్యాచ్‌లో మా వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నించాం. వర్షం తర్వాత బంగ్లాదేశ్‌ చేతిలో ఇంకా పది వికెట్లు ఉండడంతో మ్యాచ్ ఎలాగైనా సాగుతుందని అనుకున్నా..' అంటూ చెప్పుకొచ్చాడు.


ఈ మ్యాచ్‌లో సూపర్ పర్ఫామెన్స్ చేసిన అర్షదీప్ సింగ్‌పై హిట్ మ్యాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో అతని ప్లేస్‌ను అర్షదీప్ భర్తీ చేశాడని చెప్పాడు. గత 9 నెలల నుంచి అర్షదీప్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లను కూడా రోహిత్ శర్మ మెచ్చుకున్నాడు. 


'ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. కీలకమైన సమయాల్లో మా ఆటగాళ్లు అద్భుతంగా క్యాచ్‌లు పట్టారు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న విధానం అద్భుతంగా ఉంది. టీమ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఎలాంటి ఆటగాడో మాకు తెలుసు. అతను బాగా బ్యాటింగ్ చేస్తే.. మా జట్టు వేరే స్థితిలో ఉంటుంది..' అని హిట్ మ్యాన్ చెప్పాడు. 


ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (50) హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. కింగ్ కోహ్లి (64) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. వర్షం కారణంగా బంగ్లాకు 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 6 వికెట్లు 145 పరుగులకు పరిమితమైంది. బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ 27 బంతుల్లో 60 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. భారత బౌలర్ల అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.


Also Read: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్‌ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. తిట్టినోళ్లే పోగుడుతున్నారుగా (వీడియో)!


Also Read: IND vs BAN Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ.. బంగ్లాపై భారత్ విజయం!


 



Also Read: IND vs BAN Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ.. బంగ్లాపై భారత్ విజయం!


Also Read: How To Lose Weight: బరువు తగ్గే క్రమంలో ఉదయం పూట ఇలా చేస్తున్నారా.. ఇక అంతే సంగతి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.