`కఠిన సమయాల్లో మన జట్టుకు మద్దతివ్వండి`
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో భారత జట్టు విఫలమవుతున్న క్రమంలో టీమిండియాకు అభిమానులు మద్దతుగా నిలవాలని క్రికెటర్ రోహిత్ శర్మ కోరారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో భారత జట్టు విఫలమవుతున్న క్రమంలో టీమిండియాకు అభిమానులు మద్దతుగా నిలవాలని క్రికెటర్ రోహిత్ శర్మ కోరారు. ఆయనకు బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తోడయ్యారు.
భారత్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా భారత్ వైఫల్యం చెందడంతో వారిలో ఉత్సాహం నింపేందుకు సెలబ్రెటీలు ముందుకు వచ్చారు. భారత క్రికెటర్ రోహిత్ శర్మ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లు.. భారత క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
'ఈ ఆటగాళ్లే టీమిండియాకు టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకు అందించారని మరవొద్దు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మద్దతివ్వండి. ఎందుకంటే ఇది మన జట్టు’ అని రోహిత్ శర్మ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు అమితాబ్ స్పందిస్తూ.. ‘రోహిత్.. నీ వ్యాఖ్యలను నేను అంగీకరిస్తాను. కమాన్ ఇండియా.. మనం సాధించగలం’ అని టీమిండియాకు ఆయన మద్దతు తెలిపారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో విఫలమై 107 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇవాళ ఇంగ్లాండ్ తన ఇన్నింగ్స్ ఆటను కొనసాగించనుంది. భారత బౌలర్లు మెరుగ్గా రాణిస్తే రెండో టెస్టులో గట్టెక్కొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.