IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో మూడో వన్డే.. ఎంఎస్ ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ!!
IND vs WI 3rd ODI: మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సిక్సర్ బాదితే.. భారత్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మాజీ సారథి ఎంఎస్ ధోనీని అధిగమిస్తాడు.
Rohit Sharma eye on MS Dhoni Record: వెస్టిండీస్‌పై తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తాచాటుతున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఆఖరి సమరానికి సిద్ధమైంది. ఈరోజు జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ మార్పులు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎలాగైనా క్లీన్ స్వీప్ కాకుండా పరువు కాపాడుకోవాలని వెస్టిండీస్ ప్రయత్నిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.
మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ సారథి ఎంఎస్ ధోనీ రికార్డుపై కన్నేశాడు. రోహిత్ ఈరోజు మ్యాచులో ఓ సిక్సర్ బాదితే భారత్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీని అధిగమిస్తాడు. ప్రస్తుతం భారత్‌లో జరిగిన వన్డేలలో ఇద్దరూ 116 సిక్సర్లతో సమంగా ఉన్నారు. అయితే మహీ 113 ఇన్నింగ్స్‌లలో 116 సిక్సులు బాదితే.. రోహిత్ కేవలం 68 ఇన్నింగ్స్‌లలోనే 116 సిక్సులు బాదాడు.
విండీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే స్వదేశంలో ఒక జట్టును వైట్‌వాష్ చేసిన ఎనిమిదో కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులోకి ఎక్కనున్నాడు. కపిల్‌దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఈ జాబితాలో ఉన్నారు. వెస్టిండీస్‌ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్ వైట్‌వాష్ చేయలేదు. ఈసారి దానిని బ్రేక్ చేసే అవకాశం రోహిత్ శర్మకు వచ్చింది. 2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0తో చివరగా భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
విండీస్‌పై మూడో వన్డేలో విజయం సాధిస్తే స్వదేశంలో టీమిండియాకు 12వ వైట్‌వాష్ సిరీస్ విజయం దక్కుతుంది. భారత గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్ జట్లు వైట్‌వాష్ అయ్యాయి. ఈరోజు జరగనున్న మూడో వన్డేలో ఓటమిపాలయ్యి వెస్టిండీస్ వైట్‌వాష్ అయితే ఈ జాబితాలో చేరనుంది. వెస్టిండీస్ ఇప్పటివరకు 19 వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయింది. టీమిండియా చేతిలోనూ వైట్‌వాష్ అయితే ఆ సంఖ్య 20కి చేరనుంది.
Also Read: Mahabubnagar: విషాదం.. మరో మూడు గంటల్లో పెళ్లి... ఇంతలో వరుడు మృతి...
Also Read: TS SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్... పరీక్షల షెడ్యూల్‌పై ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook