Suresh Raina praises Rohit Sharma: రోహిత్ శర్మపై సురేష్ రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత జట్టు కెప్టేన్‌గా మళ్లీ అంతటి గొప్ప లక్షణాలు రోహిత్ శర్మలో చూశానని రైనా కితాబిచ్చాడు. రోహిత్ కెప్టేన్సీలో ఆసియా కప్‌ ఆడినప్పుడు అతడిని మరింత దగ్గరగా గమనించాను. శార్దూల్‌ థాకూర్, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి యువ ఆటగాళ్లను రోహిత్ శర్మ ప్రోత్సహించిన తీరు బాగా నచ్చింది. అంతేకాకుండా తాను కెప్టేన్‌గా ఉన్నప్పటికీ.. ప్రతీ ఆటగాడి సలహాలు, సూచనలు స్వీకరించే మనస్తత్వం ఉన్నవాడు. అందుకే నాకు తెలిసి టీమిండియాకు తర్వాతి ఎం.ఎస్. ధోనీ ( MS Dhoni) ఎవరైనా ఉన్నారా అంటే.. అది రోహిత్‌ శర్మే అంటాను అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


ధోనీలాగే డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతీ ఒక్క ఆటగాడిని గౌరవించడం రోహిత్ శర్మలో చూశాను. తన సారధ్యంలో క్రికెట్ బాగా ఎంజాయ్ చేస్తాను అంటూ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నాడు. సూపర్‌ ఓవర్‌ పాడ్‌కాస్ట్‌‌ కార్యక్రమంలో తాజా ఎపిసోడ్‌లో సౌతాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమిని, జెమిమా, లియాం ఫ్లింట్‌తో యూఏఈలో జరగనున్న ఐపిఎల్ 2020 గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. 


మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత కెప్టేన్‌గా ఓవైపు Virat Kohli అందరి మన్ననలు అందుకుంటున్న ప్రస్తుత తరుణంలో కెప్టేన్‌గా రోహిత్ శర్మ క్రమశిక్షణ గురించి రైనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.