WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ గురించి ఆలోచించడం లేదు.. నాలుగో టెస్టులో గెలిచేందుకు ప్రయత్నిస్తాం!
Rohit Sharma recact about WCT Final 2023. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ గురించి ఆలోంచించలేదని, ఇక నాలుగో టెస్టులో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ శర్మ అన్నాడు.
Rohit Sharma says We have not thought about WCT Final 2023: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమిని ఎదుర్కొంది. సొంత గడ్డపై స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న టీమిండియాపై ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యంను ఆసీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మూడో రోజుల్లో ముగిసిన మూడో టెస్టులో ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నాథన్ లైయన్ ఎంపికయ్యాడు. ఈ విజయంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. ఇక చివరి టెస్టు మార్చి 9న అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది.
మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. 'ఓడిపోవడం నిరాశ కలిగించే అంశం. ఒక టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే చాలా విషయాలు మన చేతుల్లో ఉండవని అర్థం. బ్యాటింగ్‌లో సరైన ఆరంభం దక్కలేదు. ప్రత్యర్థి 70-80 పరుగుల ఆధిక్యం సాధించాక తొలి ఇన్నింగ్స్‌లో మా స్కోరు బోర్డుపై మరిన్ని పరుగులు ఉంటే బాగుండేదనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ మేము అనుకున్న విధంగా బ్యాటింగ్ చేయలేదు. ఆసీస్‌కు కేవలం 76 పరుగులను లక్ష్యంగా నిర్దేశించాం. తొలి రెండు మ్యాచుల్లో ఎలా గెలిచాం, ఇప్పుడు ఎందుకు ఓడిపోయామనేదానిపై చర్చించుకుంటాం' అని రోహిత్ అన్నాడు.
'ఇప్పటివరకు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ గురించి ఆలోంచించలేదు. ఇక చివరి టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. పిచ్‌లతో సంబంధం లేకుండా.. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. సవాళ్లతో కూడుకున్న పిచ్‌లపై ధైర్యంగా ఆడాలి. బౌలింగ్‌లో రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. ప్రణాళికలను అమలు చేయడంలో తప్పిదాలు జరిగాయి. అందుకే ఓడిపోవాల్సి వచ్చింది. చివరి టెస్టులో తప్పకుండా పుంజుకుంటాం. మూడు రోజుల్లో మ్యాచులు అన్ని చోట్లా ముగుస్తున్నాయి. పాకిస్థాన్‌లో ఇలానే జరిగింది. ఐదు రోజులు ఆడి అభిమానులకు బోర్ కొట్టించాలని అనుకోవడం లేదు' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. కనీసం డ్రా చేసుకున్నా.. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు భారత్ చేరుకుంటుంది. ఒకవేళ టీమిండియా నాలుగో టెస్టులో ఓడితే మాత్రం.. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు భారత్ భవితవ్యం శ్రీలంక, న్యూజిలాండ్ సిరీసుపై ఆధారపడి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.