Rohit Sharma breaks MS Dhoni Most ODI Sixes In India: టీమిండియా స్టార్ ఓపెనర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. భారత గడ్డపై ధోనీ 123 సిక్సర్లు బాధగా.. రోహిత్ 125 సిక్సర్లు బాదాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌కు ముందువరకు సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. మూడో ఓవర్‌లో మహీ ఆల్ టైమ్ రికార్డును రోహిత్ దాటేశాడు. హెన్రీ షిప్లీ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా సిక్సర్ కొట్టాడు. ఐదో ఓవర్‌ నాలుగో బంతికి మరోసారి షిప్లే బౌలిం‍గ్‌లోనే భారత కెప్టెన్ సిక్స్‌ బాదాడు. దాంతో రోహిత్ ఈ జాబితాలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఈ వన్డేలో 38 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు. టిక్నర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు.


చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఉప్పల్‌ మైదానంలో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించింది. దీంతో మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని టీమిండియా భావిస్తోంది. శ్రీలంకపై సిరీస్‌ల విజయంతో ఉన్న భారత్‌.. న్యూజిలాండ్‌ను కూడా ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. ముందుగా బ్యాటింగ్ చేస్తోన్న భారత్ 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరు అందుకున్నాడు. 


సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు వీరే:
# రోహిత్‌ శర్మ- 125
# ఎంఎస్‌ ధోనీ- 123
# సచిన్ టెండూల్కర్ - 71
# యువరాజ్‌ సింగ్‌- 71 


Also Read: Venus Transit 2023: కుంభ రాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారు ధనవంతులు అవడం పక్కా! ఊహించని బ్యాంక్ బ్యాలెన్స్  


Also Read: Bhadra Rajyog 2023: అరుదైన భద్ర రాజయోగం.. ఈ రాశుల వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు! వివాహం జరిగే అవకాశం   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.