Mumbai Indians vs Delhi Capitals IPL 2020 final match: దుబాయ్: డిఫెండింగ్‌ ఛాంపియన్‌‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2013, 2015, 2017, 2019 తర్వాత ముంబై ఇండియన్స్ ఖాతాలో మొత్తంగా ఇది ఐదో టైటిల్ కావడం విశేషం. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2020 ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈసారి అయినా తొలి ఐపిఎల్ ట్రోఫీ కైవసం చేసుకోవాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ కల కలగానే మిగిలిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : IPL 2020 Final: ఢిల్లీ వర్సెస్ ముంబై పోరు..కప్ విజేత ఎవరు


ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్స్‌లో రోహిత్‌ శర్మ (68: 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్‌ కిషన్‌ (33 నాటౌట్: 19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి  ఛేదించింది. క్వింటన్‌ డికాక్‌(20), సూర్యకుమార్‌ యాదవ్‌(19) ఫర్వాలేదనిపించారు.   ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా రబాడ, స్టాయినీస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. Also read : IPL 2020 Final: ఢిల్లీ నడ్డి విరిచేందుకు రోహిత్ పక్కా వ్యూహం!



అంతకంటే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌లో శ్రేయస్‌ అయ్యర్ (65 నాటౌట్‌: 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు)‌, రిషబ్‌  పంత్‌ (56: 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ గబ్బర్ శిఖర్ ధావన్ (15), రహానె (2) తోనే నిరాశపరిచారు. మార్కస్ స్టొయినీస్‌ (0), హెట్‌మెయిర్‌ (5) దారుణంగా విఫలమయ్యారు. Also read : Rohit sharma Selected for Australia Tour: టీమిండియా నుంచి రోహిత్ శర్మకు పిలుపు.. కానీ ఒక్క ఛాన్స్!



ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/30) స్టొయినిస్, అజింక్య రహానే, హెట్మెయిర్ వంటి బ్యాట్స్‌మెన్‌ని ఆదిలోనే పెవిలియన్‌కి పంపించడంతో ఢిల్లీ ఆట కట్టించినట్టయింది. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ (2/29), జయంత్‌ యాదవ్‌ (1/25) బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది.


Also read : IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe