Rohit Sharma Tests Negative For COVID-19:  మూడో టెస్టుకు ముందు భారత క్రికెటర్లకు భారీ ఊరట లభించింది. బయోబుల్ నిబంధనలు అతిక్రమించారని, దీంతో మూడో టెస్టులో భారత జట్టు కూర్పుపై తలెత్తిన అనుమానాలకు బీసీసీఐ తెర దించింది. భారత ఆటగాళ్లు అయిదుగురికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షల ఫలితాలో అందరికీ కరోనా నెగెటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో మూడో టెస్టు ఆడేందుకు రెస్టారెంట్ భోజనం వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లకు లైన్ క్లియర్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు భోజనానికి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), పృథ్వీ షా, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, నవదీప్ సైనీ వెళ్లడం దుమారం రేపడం తెలిసిందే. వీరు బయోబుల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ క్రికెట్ ఆస్ట్రేలియా తన కుయుక్తులు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తమ ప్రొటోకాల్ పాటించింది. ఈ అయిదుగురు క్రికెటర్లను జట్టు ఇతర ఆటగాళ్ల నుంచి దూరంగా ఐసోలేషన్‌లో ఉంచింది. 


Also Read: Indian Cricketers Retired In 2020: ఈ ఏడాది రిటైరైన భారత క్రికెటర్లు వీరే



ఓపెనర్ రోహిత్ శర్మ సహా రెస్టారెంట్‌కు వెళ్లిన క్రికెటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలినట్లు బీసీసీఐ(BCCI) శుభవార్త చెప్పింది. దీంతో మూడో టెస్టు ఆడేందుకు అయిదుగురు భారత ఆటగాళ్లకు భారీ ఊరట లభించింది. ఒకవేళ వీరిని ఆడేందుకు అనుమతించని పక్షంలో బాయ్‌కాట్ చేయడం లాంటి అంశాలు సైతం తెరమీదకు వచ్చాయంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.


Also Read: Rohit Sharma: వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ రోహిత్ శర్మకు పగ్గాలు



భారత క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి సైతం RT-PCR Test చేయగా వారికి సైతం కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ స్పష్టం చేయడంతో లైన్ క్లియర్ అయింది. మరోవైపు భారత జట్టు మాత్రం ఈ వివాదాలను పక్కనపెట్టి జనవరి 7న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న కీలకమైన మూడో టెస్టుకు సన్నద్ధమవుతున్నారు. 


Also Read: Rohit sharma: శర్మ గారి అబ్బాయి బీఫ్ తిన్నాడా..రోహిత్ శర్మ చుట్టూ బీఫ్ వివాదం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook