RR vs RCB: ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. గత ఛాంపియన్లు చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇంకా బోణీ చేయకపోగా..రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ లెవెన్, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ వంటి జట్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్ఆర్‌కు ఆర్సీబీ బ్రేక్ వేసింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఆర్ఆర్‌పై విజయం నమోదు చేసింది. 


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ ఓ దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.  ఈ దశలో షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్ అద్భుత ఆటతీరుతో జట్టును నడిపించారు. విజయాన్ని నమోదు చేశారు. షాబాద్ అహ్మద్ 45 పరుగులు చేశాడు. ఆర్సీబీ విజయానికి 13 బంతుల్లో 16 పరుగులు కావల్సి ఉండగా..షాబాజ్ అహ్మద్ అవుటయ్యాడు. ఆ తరువాత దినేష్ కార్తిక్ జట్టుకు విజయాన్ని అందించాడు.


రాజస్తాన్ రాయల్స్ జట్టు నుంచి జోస్ బట్లర్, షిమ్రాన్ హిట్మెయిర్ చివరి రెండు ఓవర్లతో సిక్సర్లతో రెచ్చిపోయారు. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్ 169 పరుగులు చేయగలిగింది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 22 మ్యాచ్‌లు జరగగా..12 సార్లు ఆర్బీసీ, 10సార్లు ఆర్ఆర్ గెలిచాయి. 


Also read: RR vs Bangalore: జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ... చివర్లో మెరుపులు... బెంగళూరు టార్గెట్ 170...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook