మరో భారత క్రికెటర్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. టీమిండియా బౌలర్ బౌలర్‌ ఆర్పీ సింగ్‌(32) క్రికెట్‌ కెరీర్ కు గుడ్‌బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆర్పీ సింగ్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. తన కెరీర్ లో జరిగిన విషయాలను ఓ లేఖ ద్వారా పంచుకున్న ఆర్పీ సింగ్‌.. సరిగ్గా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన రోజే (సెప్టెంబర్ 4, 2015)క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘13 ఏళ్ల క్రితం ఇదే రోజు సెప్టెంబర్‌ 4, 2005లో మొదటిసారి టీమిండియా జెర్సీ ధరించాను. నా జీవితంలో ఇదో గొప్ప అనుభూతి. ఈ రోజు నా ఆటకు ముగింపు పలుకుతున్నాను. ఈ క్రికెట్ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్' అని లేఖలో పేర్కొన్నాడు.


ఆర్పీ సింగ్‌ కెరీర్ విషయానికివస్తే .. యూపీకి చెందిన ఈ బౌలర్ 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 40, వన్డేల్లో 69, టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 82 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యుడైన ఆర్పీ సింగ్‌.. చవరగా 2016లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.