Rajasthan Royals Vs Delhi Capitals Dream11 Team: ఢిల్లీ క్యాపిటిల్స్‌తో నేడు రాజస్థాన్ రాయల్స్‌ ఢీకొట్టనుంది. తొలి మ్యాచ్‌లో లక్నోపై 20 రన్స్‌దే విజయం సాధించిన రాజస్థాన్.. రెండో మ్యాచ్‌లోనూ సొంతగడ్డపై గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఢిల్లీ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. టోర్నీలో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని చూస్తోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 27 సార్లు తలపడగా.. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌లు, ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? ప్లేయింగ్ 11లో ఎవరుంటారు..? డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: April Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే


పిచ్ రిపోర్ట్..


సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే స్పిన్నర్లు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు 180 రన్స్‌గా ఉంది. సెకెండ్ బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువసార్లు విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సొంతగడ్డపై ఆడిన జట్లనే విజయం వరించింది. మరి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ హవా కొనసాగుతుందో లేదో చూడాలి. 


లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:


==> మ్యాచ్:    రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
==> సమయం: సాయంత్రం    07:30 PM
==> వేదిక:    సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
==> టీవీ లైవ్:    స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
==> యాప్, వెబ్‌సైట్:    జియో సినిమా


రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్  (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్


ఢిల్లీ క్యాపిటల్స్: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.


RR Vs DC Dream11 Prediction Today: 


వికెట్ కీపర్: సంజూ శాంసన్, షెయ్ హోప్, జోస్ బట్లర్ 


బ్యాట్స్‌మెన్: డేవిడ్ వార్నర్, యశస్వి జైస్వాల్ (కెప్టెన్)


ఆల్‌రౌండర్లు: మిచెల్ మార్ష్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్


బౌలర్లు: ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్, చాహల్, ఖలీల్ అహ్మద్.


Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter