FIDE Chess Olympiad: 96 ఏళ్లలో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత్
ఫిడే చెస్ ఒలంపియాడ్ (FIDE online Chess Olympiad)లో భారత్ స్వర్ణం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా విజేతగా అవతరించింది భారత్.
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) చెస్ ఒలంపియాడ్ (FIDE online Chess Olympiad)లో భారత్ అద్భుతం చేసింది. రష్యాతో కలిసి భారత్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ (FIDE Chess Olympiad Winner) టైటిల్‌ను సొంతం చేసుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనే ఫిడే చెస్ ఒలంపియాడ్ నిర్వహించగా తొలిసారి భారత్ స్వర్ణం సాధించింది. 96 ఏళ్ల ఫిడే చెస్ ఒలంపియాడ్‌లో భారత్ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే నాటకీయ పరిస్థితుల్లో భారత్ సంయుక్త విజేతగా అవరించింది. Vijay Deverakonda: ‘డియర్ కామ్రేడ్’ సినిమా సరికొత్త రికార్డు
తొలి గేమ్ భారత్, రష్యా 3-3తో డ్రా చేసుకున్నాయి. రెండో గేమ్ జరుగుతుండగా సెమి ఫైనల్ తరహాలోనే ఇంటర్నెట్ అంతరాయం తలెత్తింది. భారత ఆటగాళ్లకు ఇంటర్నెట్, సాంకేతిక సమస్య కారణంగా రష్యా 4.5-1.5 ఆధిక్యంలో నిలిచింది. తొలుత రష్యాను విజేతగా ప్రకటించగా.. ఇంటర్నెట్ సమస్య కారణంగా తమ ఆటకు అంతరాయం తలెత్తిందని భారత్ ఫిడేకు ఫిర్యాదు చేయగా.. అంతా పరిశీలించిన ఫిడే ఈ ఏడాది చెస్ ఒలంపియాడ్ విజేతలుగా రష్యా, భారత్‌ల పేర్లను ప్రకటించింది. వాస్తవానికి సాంకేతిక కారణాలు తలెత్తకపోతే భారత్ విజేతగా అవతరించేదని చెబుతున్నారు. Uppena Movie: ‘ఉప్పెన’ సినిమా డబుల్ ధమాకా కానుందా!
2014లో జరిగిన ఫిడే చెస్ ఒలంపియాడ్‌లో కాంస్యమే ఇప్పటివరకూ భారత్ సాధించిన అతిపెద్ద విజయం. ప్రపంచ వేదికలపై సత్తా చాటే మన ఆటగాళ్లు చెస్ ఒలంపియాడ్‌లో మాత్రం వెనుకంజలో ఉండేవారు. పరుషులు, మహిళలు, జూనియర్ విభాగంలో కలిసికట్టుగా రాణిస్తేనే విజయం లభిస్తుంది. తాజాగా జరిగిన ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలంపియాడ్‌లో కలిసికట్టుగా రాణించడంతో స్వర్ణం కైవసం చేసుకున్నారు. Meera Mitun Hot Stills: నటి మీరా మిథున్ ఫొటోలు ట్రెండింగ్
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి