Ruturaj Gaikwad hits 4th century in Vijay Hazare Trophy: గత రెండు సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో కరోనా వైరస్ కారణంగా లేటుగా టోర్నీలోకి వచ్చినా.. అందరూ విఫలమయిన చోట మనోడు వరుస హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక ఐపీఎల్ 2021లో సీఎస్‌కే టైటిల్ గెలవడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్ దేశవాలీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2021లోనూ కొనసాగిస్తున్నాడు. మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్‌ సెంచరీలను సునాయాసంగా చేస్తున్నాడు. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా చండీఘర్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) శతకం బాదాడు. 95 బంతుల్లో 100 పరుగులు చేశాడు. విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు చేయడం విశేషం. దాంతో రుతురాజ్ ఓ రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన వారిలో టీమిండియా ప్లేయర్స్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), దేవదత్‌ పడిక్కల్‌, పృథ్వీ షాల సరసన చేరాడు. అంతేకాదు ఈ సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా మరో రికార్డు అందుకున్నాడు. 


Also Read: Naga Chaitanya: నా ఫ్యామిలీని అస్సలు ఇబ్బంది పెట్టను.. సమంతపై సెటైర్లు పేల్చిన నాగ చైతన్య!!


త్వరలోనే దక్షిణాఫ్రికా గడ్డపైకి భారత్ వెళ్లనుంది. 16న ముంబై నుంచి భారత్ బయలుదేరుతుందని సమాచారం.  డిసెంబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతుండగా.. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ పర్యటన కోసం టెస్ట్ జట్టును ఎంపిక చేయగా.. వన్డే టీంను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో పరుగుల వరద పారిస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)ను టీమిండియాకు ఎంపికచేయాలని అభిమానులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు వెంకటేష్ అయ్యార్ కూడా విజయ్‌ హజారే ట్రోఫీ ద్వారా తన పరుగుల దాహాన్ని తర్చుకుంటున్నాడు. మరోవైపు టీమిండియా రెగ్యులర్ ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్ కనబరుస్తున్నారు. దాంతో జట్టులో ఎవరికి తీసుకోవాలనే తలనొప్పి బీసీసీఐ సెలక్టర్లకు తప్పకపోవచ్చు. 


Also Read: Dog eats body: మార్చురీలో ఉంచిన శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్క


దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్‌ శర్మకు బీసీసీఐ (BCCI) బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. బీసీసీఐ నిర్ణయం విరాట్‌ను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టెస్ట్ సిరీస్‌ కోసం ఆదివారం ముంబైలో ప్రాక్టీస్‌ చేస్తుండగా రోహిత్‌ శర్మకు గాయం అయింది. రోహిత్ తొడ కండరాల గాయం బారిన పడటంతో టెస్టు సిరీస్‌కు దూరమవ్వగా.. అతడి స్థానంలో ప్రియాంక్‌ పాంచల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook