Ruturaj Gaikwad: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కివీస్ టీ20 సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్
Ruturaj Gaikwad Ruled Out Of India Vs New Zealand T20 Series: కివీస్ టీ20 సిరీస్‌కు భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే అతని ప్లేస్‌లో జట్టులోకి ఎవరిని తీసుకోలేదు.
Ruturaj Gaikwad Ruled Out Of India Vs New Zealand T20 Series: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌ను గెలుచుకునేందుకు రెడీ అవుతోంది. శుక్రవారం నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాంచీలో జరగనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మణికట్టు నొప్పి కారణంగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జట్టు నుంచి వైదొలిగాడు. ఈ యంగ్ ప్లేయర్‌ను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించింది బీసీసీఐ. రుతురాజ్ స్థానంలో ఎవరి ఎంపిక చేయట్లేదని తెలిపింది. జట్టులో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌కు తోడు ప్రత్యామ్నయంగా పృథ్వీ షా ఉండడంతో మరో ప్లేయర్‌ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది.
గైక్వాడ్ చివరిసారిగా రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో 8, 0 స్కోర్లు చేశాడు. ఆ తర్వాత తన మణికట్టు పరిస్థితి గురించి బీసీసీఐకి నివేదించాడు. గైక్వాడ్‌కు మణికట్టు సమస్య రావడం ఇది రెండోసారి. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా ఇదేవిధమైన గాయం కారణంగా అతడు దూరమయ్యాడు. అదేవిధంగా కోవిడ్‌కు పాజిటివ్ కారణంగా అతను గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశంలో వన్డేల నుంచి తప్పుకున్నాడు.
టీమిండియా జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.
భారత్ Vs న్యూజిలాండ్ టీ20 సిరీస్:
మొదటి టీ20 మ్యాచ్, జనవరి 27, రాత్రి 7.00, రాంచీ
రెండవ టీ20 మ్యాచ్, జనవరి 29, 7.00, లక్నో
మూడో టీ20 మ్యాచ్, ఫిబ్రవరి 1, రాత్రి 7.00 అహ్మదాబాద్
Also Read: YS Sharmila: సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే.. రాజీనామా చేసి వెళ్లిపోవాలి: వైఎస్ షర్మిల
Also Read: MLC Kavitha: గవర్నర్‌కు ధన్యవాదాలు చెబుతూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్.. ట్వీట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి