Cricket World Cup 2023, SA vs ENG Highlights: వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది దక్షిణాఫ్రికా. ముంబైలోని  వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో 229 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది సఫారీ జట్టు. దీంతో మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెుదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత  50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. 400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 170 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్లలో ఆట్కిన్సన్‌ (35; 21 బంతుల్లో 7×4), మార్క్‌ వుడ్‌ (43*; 17 బంతుల్లో 2×4, 5×6) మాత్రమే రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్‌ 3 వికెట్లు తీశాడు. 


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ టీమ్ కు  తొలి ఓవర్లలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి డికాక్ ఔటయ్యాడు. అనంతరం హెండిక్స్ తో జతకలిసిన డసెన్‌ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 121 పరుగులు పార్టనర్ షిప్ నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అదిల్‌ రషీద్‌ విడగొట్టాడు. రషీద్‌ వేసిన 19వ ఓవర్లో డసెన్‌.. బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ మార్క్రమ్‌ తో జతకలిసిన హెండ్రిక్స్ మూడో వికెట్‌ కు 39 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా రషీదే తీసుకోవడం విశేషం. 


హెండ్రిక్స్‌ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన  క్లాసెన్‌ ఇంగ్లీష్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. మార్క్రమ్‌తో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ ఇరువురూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు.  మార్క్రమ్‌, మిల్లర్ వెంట వెంటనే ఔటైనా జాన్సెన్‌ సహాయంతో ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు క్లాసెన్. ఈ క్రమంలో కేవలం 67 బంతుల్లోనే 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 109 పరుగులు చేశాడు క్లాసెన్. మరోవైపు జాన్సన్ కూడా 42 బంతుల్లో మూడు ఫోర్లు, 6 సిక్సర్లు సహాయంతో 75 పరుగులు చేశాడు. తమ బ్యాటర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది సఫారీ జట్టు. ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లే మూడు వికెట్లు తీశాడు. 


Also read:India vs New Zealand Updates: టీమిండియాకు గాయాల భయం.. ఇషాన్‌ కిషన్‌పై తేనెటీగ దాడి.. సూర్యకు మణికట్టు గాయం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook