ఆస్ట్రేలియా కార్చిచ్చు రేగడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదం నుంచి సర్వం కోల్పోయిన వారూ ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని .. కార్చిచ్చు నుంచి తప్పించుకున్నారు... కానీ .. ఇళ్లు, ఆస్తులు సర్వనాశనం అయిపోయాయి. దీంతో ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయారు. అలాంటి వారిని ఆదుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తోంది. 'బుష్ ఫైర్ క్రికెట్ బ్యాష్' పేరుతో నిర్వహిస్తున్న ఈ ఛారిటీ మ్యాచ్ కు నేను సైతం అంటూ ప్రపంచవ్యాప్తంగా పలు క్రికెటర్లు ముందుకొచ్చారు. పాంటింగ్ ఎలెవెన్, షేన్ వార్న్ ఎలెవన్ మధ్య ఫిబ్రవరి 8న  మ్యాచ్ జరగనుంది. 
కోచ్‌గా సచిన్ టెండూల్కర్
ఈ మ్యాచ్ తో మరోసారి భారత క్రికెట్ మాజీ దిగ్గజం.. క్రికెట్ దేవుడుగా పేరు పొందిన సచిన్ టెండూల్కర్  మైదానంలోకి దిగుతున్నారు. అవును.. ఆయన పాంటింగ్ ఎలెవన్ జట్టుతో చేరారు. కానీ క్రికెట్ ఆడడానికి కాదు. పాంటింగ్ ఎలెవెన్ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కోట్నీ వాల్ష్ .. షేన్ వార్న్ ఎలెవన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181269","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఈ మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికీ పాంటింగ్, షేన్ వార్న్, జస్టిన్ లాంగర్, ఆడమ్ గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్ వెల్, మైఖెల్ క్లార్క్, స్టీవ్ వా, మెల్ జోన్స్ తమ సమ్మతి తెలిపారు. ఫిబ్రవరి 8న జరిగే మ్యాచ్ కోసం మరికొద్ది రోజుల్లో స్టేడియంను నిర్ణయించనున్నారు. నిజానికి ఈ మ్యాచ్ ను ఓవల్ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. కానీ అదే రోజు భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ ఉంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..