Sara Tendulkar enjoys Thailand vacation with Friends: సారా టెండూల్క‌ర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్ కూతురిగా ఈ ప్ర‌పంచానికి పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. త‌న అందం, అభినయంతో సారా కుర్రాళ్ల మ‌న‌స్సును దోచేశారు. సారాకు సోషల్ మీడియాలో ఫాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. హీరోయిన్‌కు మించిన అందం ఉన్న సారా ఒక్క ఫోటో పెట్టిందంటే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడుస్తూ సారా టెండూల్క‌ర్ లండన్‌లో మెడిసిన్ చదివారు. ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసిన సారా.. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబందించిన పోటోలను ఎప్పటికప్పుడూ షేర్‌ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. సారా ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీస్, వెకేషన్‌ అంటూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఆ ఫొటోస్ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి అభిమానులకు కనువిందు చేస్తారు. 


ప్రస్తుతం సారా టెండూల్క‌ర్ థాయ్‌లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన ఆమె.. కో సమోయ్ బీచ్ రిసార్ట్‌లో తెగ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‌లు, కొబ్బరి తోటలు మరియు దట్టమైన పర్వతాలలో సారా సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలో సచిన్ తనయ పూల ప్రింట్ స్కర్ట్, పర్పుల్ కట్-స్లీవ్స్ టాప్ మరియు వైట్ షర్ట్ ధరించి ఉన్నారు. సారాకు సంబందించిన వీడియోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 



మరోవైపు గత 2-3 ఏళ్లుగా సారా టెండూల్క‌ర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. టీమిండియా యువ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌తో సారా ప్రేమ‌లో ఉందని ఆ వార్తల సారాంశం. గిల్‌, సారాలు ఒకరి పోస్టులకు మరొకరు లైక్స్, కామెంట్స్ చేసుకోవడమే ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే ఆ వార్త‌ల‌ను ఎవరూ ధృవీక‌రించ‌లేదు.. అలాగ‌ని కొట్టి పారేయ‌లేదు. దాంతో ఇద్దరి మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అని నెటిజన్లు అంటున్నారు. 




Also Read: Thief Funny Video: వీడో వెరైటీ దొంగ.. గన్ పెట్టి మొబైల్ కొట్టేశాడు! చివరకు ఊహించని ట్విస్ట్  


Also Read: Flipkart Smart Tv Offers: ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.22,900.. కానీ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో రూ.2849కే..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook