T20 World Cup 2021: వార్మప్ మ్యాచ్‌ల(Warm-up Matches)లో పాక్ జట్టు ఆడిన తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్(Salman Butt) తీవ్రంగా తప్పుబట్టాడు. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా... ప్రాక్టీసు మ్యాచ్‌లలో కూడా అభద్రతా భావంతో ఆడటం ఏమిటని ప్రశ్నించాడు. ఈ విషయంలో టీమిండియా(Teamindia)ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చురకలు అంటించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా.. పాకిస్తాన్(Pakistan) ఆడిన వార్మప్ మ్యాచ్ లలో వెస్టిండీస్(Westindies) పై విజయం సాధించగా, దక్షిణాఫ్రికాతో ఓడిపోయింది. ప్రోటీస్ తో మ్యాచ్ లో  ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్ విఫలమయ్యారు. ఫఖార్‌ జమాన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి ఇతరులకు అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా(SouthAfrica) ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్... నిర్ణీత 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటీస్‌ను... వాన్‌ డెర్‌ డస్సెన్‌ సెంచరీతో మెరిసి.. జట్టును గెలిపించాడు. 


Also read: IND Vs AUS warm-up match: రోహిత్​ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్​.. రెండో వార్మప్​ మ్యాచ్​లోనూ India విజయం


ఆటగాళ్లు అందరికీ అవకాశం ఇచ్చిన టీమిండియా..ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలపై విజయాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ భట్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించాడు. ‘‘వార్మప్‌ మ్యాచ్‌లను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకుంది. ఐపీఎల్‌లో వాళ్ల ఆటగాళ్లు ఆడినప్పటికీ.. మరోసారి అందరికీ అవకాశమిచ్చి పరీక్షించింది. కానీ... పాకిస్తాన్‌కు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. 


'‘నువ్వు కెప్టెన్‌. నీ ప్లేయర్ల ఆటతీరును గమనించాలి. ఎవరు ఎలా ఆడగలరో, ఏ స్థానంలో పంపిస్తే ఫలితం ఉంటుందో పరీక్షించాలి. కానీ... అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఒకవేళ బాబర్‌, రిజ్వాన్‌ మొదటి ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరితే పరిస్థితి ఏంటి? దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో ఏం జరిగిందో చూశాం కదా..? అసలు మీరెలాంటి వ్యూహాలు రచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అంటూ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(Babar Azam) తీరును తప్పుబట్టాడు. కాగా అక్టోబరు 24న టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి