Sam Billings Run Out Joe Denly with in Seconds like MS Dhoni in ILT20 2023: టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాట్, కెప్టెన్సీతో మాత్రమే కాకుండా వికెట్‌ కీపింగ్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. మెరుపు వేగంతో రనౌట్‌లు చేయడంలో మహీని మించిన కీపర్ లేనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెరుపు రనౌట్‌లు చేయడంలో ధోనీకి మంచి గుర్తింపు ఉంది. ధోనీ వికెట్ల వెనకాల ఉన్నాడంటే.. ఎంత పెద్ద బ్యాటర్ అయినా సరే క్రీజ్ దాటి బయటికి వెళ్లడు. స్టంపౌట్, రనౌట్ అవుతామని క్రీజ్ వదలరు. తాజాగా ఇంగ్లండ్ కీపర్ సామ్‌ బిల్లింగ్స్.. మహీని గుర్తుచేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నేషనల్ లీగ్‌ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా నేడు డెసర్ట్ వైపర్స్, షార్జా వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. డిజర్ట్‌ వైపర్స్‌ తరఫున ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ ఆడుతున్నాడు. లక్ష్య ఛేదనలో భాగంగా షార్జా వారియర్స్ కెప్టెన్ జోయ్‌ డెన్లీ క్రీజులోకి వచ్చాడు. డిజర్ట్‌ వైపర్స్ బౌలర్‌ బెన్నీ హవెల్ వేసిన బంతిని డెన్లీ షాట్ ఆడి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేలను తాకి గాల్లోకి ఎగరడంతో.. ఒకే అడుగు ముందుకేసిన డెన్లీ క్రీజులోకి వచ్చే ప్రయత్నం చేశాడు. గాల్లోకి ఎగిరిన బంతిని బిల్లింగ్స్‌ అందుకుని మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు.


జోయ్‌ డెన్లీ క్రీజులో బ్యాట్ పెట్టేలోపే సామ్‌ బిల్లింగ్స్‌ విసిరిన బంతి వికెట్లను తాకింది. ఇదంతా సెకన్ వ్యవధిలో జరిగిపోయింది. ఇంకేముంది డెన్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఇది చూసిన అంపైర్లు, ప్లేయర్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ మెరుపు రనౌట్‌ వీడియోను జీ క్రికెట్ (Zee Cricket) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ బిల్లింగ్స్‌ మెరుపు రనౌట్‌కు ఫిదా అవుతున్నారు. ఎంఎస్ ధోనీని మరిపించిన సామ్‌ బిల్లింగ్స్ అని కామెంట్స్ పెడుతున్నారు.



ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ముస్తఫా (31), హోవెల్ (34), బిల్లింగ్స్‌ (27) రాణించారు. షార్జా వారియర్స్ బౌలర్లు జవదుల్లా, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. 149 పరుగుల లక్ష్య ఛేదనలో షార్జా వారియర్స్ 8 వికెట్స్ కోల్పోయి 126 పరుగులకే పరిమితం అయింది. ల్యూక్ వుడ్, వానిందు హసరంగా తలో 3 వికెట్స్ తీసుకున్నారు. 


Also Read: ICC T20I Rankings: దుమ్ములేపిన సూర్యకుమార్‌ యాదవ్‌.. డేవిడ్ మలన్‌ ఆల్‌టైమ్‌ రికార్డుకు ఎసరు!  


Also Read: Womens IPL Auction 2023: ఐపీఎల్‌ 2023 వేలంకు ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడో తెలుసా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.