ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు  "ఉమెన్స్ డే" కాన్సప్ట్ నచ్చదని ఆమె అన్నారు. "మహిళా దినోత్సవం అనే ఒక రోజును మహిళలందరూ జరుపుకోవాలనే విధానానికి నేను వ్యతిరేకం. మనకంటూ ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే.. మనం అందరితోనూ సమానం కాదనే భావనను ఒప్పుకొన్నట్లే కదా.


అందుకే మహిళలకు ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలని నేను అనుకోను. నా ఉద్దేశంలో ప్రతీరోజూ మహిళలకు పండగే. ప్రతీ రోజును వారు ఎంజాయ్ చేయగలగాలి. మహిళల్లారా.. ప్రపంచాన్ని జయించడానికి మనం ముందుకు వెళ్తూనే ఉండాలి" అని ఆమె అన్నారు. 2006 ఆస్ట్రేలియా ఓపెన్ ప్రవేశంతో గ్రాండ్ స్లమ్ ఈవెంట్‌లో ఆడిన మొదటి భారత మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు సానియా మీర్జా. ఒకానొక సందర్భంలో భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన మహిళా క్రీడాకారిణిగా ప్రసిద్ధి చెందిన మేటి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.