నాకు అమ్మాయి పుట్టాలని కోరుకోండి: సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సానియాకి బెస్ట్ విషెస్ చెబుతూ ఆమె అభిమానులు ట్విట్టర్లో పలు పోస్టులు పెట్టారు. తమ అభిమాన టెన్నిస్ స్టా్ర్కు అబ్బాయి పుట్టాలని తాము కోరుకుంటున్నామని వారు ట్వీట్స్ చేశారు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సానియాకి బెస్ట్ విషెస్ చెబుతూ ఆమె అభిమానులు ట్విట్టర్లో పలు పోస్టులు పెట్టారు. తమ అభిమాన టెన్నిస్ స్టార్‌కు అబ్బాయి పుట్టాలని తాము కోరుకుంటున్నామని వారు ట్వీట్స్ చేశారు. అయితే ఈ ట్వీట్స్‌కి సానియా చాలా సీరియస్‌గా స్పందించారు. "దయచేసి మీ ఆలోచనా విధానం మార్చుకోండి.
నాకు అబ్బాయే పుట్టాలని ఎందుకు కోరుకుంటున్నారు. ఇప్పటికి చాలామంది నాకు ఇలాంటి ట్వీట్సే చేశారు. ఒకవేళ మీరు నా కోసం ప్రార్థించేటట్లయితే నాకు అబ్బాయి బదులుగా అమ్మాయే పుట్టాలని కోరుకోండి" అని సానియా ఆ ట్వీట్స్‌కి రిప్లై ఇచ్చారు. అదేవిధంగా మరో ట్వీట్‌కు కూడా సానియా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. అన్నయ్య లేడని ఎప్పుడూ మీరు బాధపడలేదా అని అడిగిన ఓ నెటిజన్‌కి ఆమె బదులిచ్చారు.
" నాకు అన్నయ్యలు, తమ్ముళ్లు ఎవరూ లేదు. అలాగని నేను ఎప్పుడూ ఫీలవ్వలేదు. కానీ నాకు ఓ సోదరి ఉంది. నేను త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. తాను ఆడపిల్లే కావాలని నా కోరిక. నా భర్త కోరిక కూడా అదే" అని సానియా ట్వీట్ చేశారు. సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్నారు.