Sanjay Manjrekar about Suryakumar Yadav: బొలాండ్‌ పార్క్‌ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే (IND vs SA 1st ODI)లో భారత్‌ పరాజయం పాలైన విషయం తెలిసిందే. 297 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయ కేతనం ఎగరేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు శిఖర్ ధావన్ (79), విరాట్ కోహ్లీ (51) అర్ధ శతకాలు చేసినా.. మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో భారత్ ఓటమిపాలైంది. ఇన్నింగ్స్ చివరలో శార్దూల్‌ ఠాకూర్‌ (50 నాటౌట్‌) పోరాడినా.. అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (12), శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రాహుల్‌ (KL Rahul) తక్కువ స్కోరుకే ఔటైనా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)తో కలిసి ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేయగా.. ధావన్‌ మాత్రం వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ హాఫ్ సెంచరీ చేశాడు. ఆపై కోహ్లీ కూడా అర్ధ శతకం బాదాడు. దాంతో భారత్‌ 25 ఓవర్లలో 138/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ కొద్దీ వ్యవధిలో ఈ జోడి ఔట్ కావడంతో మ్యాచ్‌ గమనమే మారిపోయింది. 


Also Read: Boy Cycle: సైకిల్ పోయిందని 6వ తరగతి బాలుడి ఫిర్యాదు.. తండ్రి చెప్పిన సమాధానం విని షాక్ అయిన పోలీసులు!!


మిడిల్ ఆర్డర్ కారణంగా భారత్‌ మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. కీలక సమయంలో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్‌ (16), శ్రేయస్‌ అయ్యర్‌ (17) పరుగులు చేయలేకపోయారు. అరంగేట్ర ప్లేయర్ వెంకటేశ్‌ అయ్యర్‌ నిరాశపరిచాడు. ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ హాఫ్ సెంచరీ బాదినా.. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు. దాంతో భారత్ ఓటమిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌ స్పందించారు. సూర్యకుమార్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని అభిప్రాయపడ్డారు. 


'టీమిండియాను గత కొద్ది కాలంగా మిడిలార్డర్‌ సమస్య వేధిస్తోంది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన రిషబ్ పంత్‌ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆపై వెంకటేశ్ అయ్యర్‌ విఫలం కావడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. మిడిలార్డర్‌లో సమర్థంగా రాణించగల సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)ని జట్టులోకి తీసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని నా అభిప్రాయం. జట్టు కూర్పులో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాలను ఛేదించడం అంత సులభం కాదు. వన్డే మ్యాచుల్లో మరింత కష్టం. ఎవరో ఒకరు బ్యాటింగ్‌ భారాన్ని మోయాల్సి ఉంటుంది. ధావన్‌, కోహ్లీ జట్టుకి మెరుగైన ఆరంభం ఇచ్చినా.. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై భారత్‌ ఆశలు వదులు కోవాల్సి వచ్చింది' అని మంజ్రేకర్‌ (Sanjay Manjrekar) అన్నారు. 


Also Read: Global Community Oscars 2021: 'గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్'కు నామినేట్ అయిన ఉదయనిధి, సూర్య దంపతులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook