Sanjay Manjrekar on Virat Kohli: ఏడేళ్లు భారత జట్టుకు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ (Virat Kohli) శనివారం (జనవరి 15) ముగింపు పలికిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ (IND vs SA)​ ఓటమి అనంతరం.. విరాట్ సోషల్​ మీడియాలో ఈ అనూహ్య ప్రకటన చేశాడు. దీంతో మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. కోహ్లీ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తుంటే.. భారత మాజీ ఆటగాడు, వివాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) మాత్రం సంచనల వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సీ నుంచి తనను తప్పించనున్నారని గ్రహించిన కోహ్లీ.. ముందే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడని మంజ్రేకర్ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ నిర్ణయంతో ఆశ్చర్యపోయా. కోహ్లీ విషయంలో చాలా తక్కువ సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకోవడం, ఆ తర్వాత టీ20 కెప్టెన్సీకి ముగింపు పలకడం, వన్డే జట్టుకు నాయకత్వం విషయంలో కోహ్లీకి బీసీసీఐ షాక్‌ ఇవ్వడం వంటివి వేగంగా జరిగిపోయాయి. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆశ్చర్యమే అయినా.. ఏదో ఒక కారణం చూపి నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం వేరే వారికి ఇవ్వకూడదని కోహ్లీ భావించాడు. అందుకే కెప్టెన్సీకి ముప్పు ఉందని వెంటనే వైదొలగాడు' అని అన్నారు. 


Also Read: Amullu Arjun: ఇక తన పేరు 'అముల్లు అర్జున్' అంటున్న అల్లు అర్జున్.. కారణం ఏంటంటే?


'ఇటీవల బీసీసీఐలో కీలక మార్పులు, టీమిండియా కోచ్‌ మార్పు వంటివి విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి కావొచ్చు. మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) నుంచి లభించినంత మద్దతు ప్రస్తుత కోచ్ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) నుంచి లభించకపోవచ్చని కోహ్లీ అనుకుని ఉంటాడు. మాజీ కోచ్‌ అనిల్ కుంబ్లే (Anil Kumble)తో కోహ్లీ విభేదించాడు. రవిశాస్త్రి నేతృత్వంలో మంచి నాయకుడిగా ఎదిగాడు. అయితే ప్రస్తుత కోచ్ ద్రవిడ్ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని కోహ్లీ భావించి ఉండొచ్చు. ప్రస్తుతం అతడు కంఫర్ట్ జోన్‌లో లేడన్న విషయం స్పష్టమవుతోంది. మునుపటిలా పరుగులు చేయలేకపోతున్నాడు. ఇవన్నీ భావోద్వేగపూరిత నిర్ణయాలే అని అర్థం చేసుకోవచ్చు' అని మంజ్రేకర్ పేర్కొన్నారు. 


Also Read: India New Test Captain: భారత టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. త్వరలోనే అధికారిక ప్రకటన!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook