IND VS SL 2nd T20 Match: టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను దురదృష్టం వెంటాడింది. శ్రీలంక సిరీస్‌లో ప్రూవ్‌ చేసుకునేందుకు మంచి అవకాశం ఉండగా.. గాయం నుంచి దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. మోకాలి గాయం కారణంగా సంజూ శాంసన్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది.  ప్రస్తుతం చికిత్స కోసం ముంబైలోనే ఉన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సంజూ శాంసన్ కుడి మోకాలికి గాయమైందని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. సంజు శాంసన్ స్కాన్ పూర్తయిందని చెప్పింది. విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించినట్లు వెల్లడించింది. సంజూ శాంసన్ స్థానంలో విదర్భ వికెట్ కీపర్ జితేష్ శర్మ భారత జట్టులోకి వచ్చాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా ఉంటాడు.  


సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసినందుకు జితేష్ శర్మకు టీమిండియాలో చోటు దక్కింది. ఈ టోర్నీలో జితేష్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో జితేష్ శర్మ 175 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. అంతకుముందు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 12 మ్యాచ్‌లు ఆడి.. జితేష్ శర్మ 29 సగటుతో.. 162 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.


సంజు శాంసన్ గాయం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారనుంది. రిషబ్ పంత్ గైర్హాజరీలో సంజూ శాంసన్ మిడిలార్డర్‌లో బెస్ట్ ఆప్షన్. అయితే ఈ యంగ్ ప్లేయర్ గాయం ఇప్పుడు టీమిండియా కష్టాలను మరింత పెంచింది. టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు శాంసన్‌కు ఈ సిరీస్‌ మంచి అవకాశం అని అందరూ భావించారు. అయితే గాయం రూపంలో అతడిని దురదృష్టం వెంటాడింది. మొదటి మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఐదు పరుగులకే ఔట్ అయిన విషయం తెలిసిందే.


శ్రీలంకతో గురువారం రెండో టీ20 మ్యాచ్ పూణె వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో రెండు పరుగులతో విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.


Also Read: Pawan Kalyan: చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. సీఎం జగన్‌పై ఆగ్రహం


Also Read: Amit Shah Flight: అమిత్ షా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook