Sanju Wins Fans Hearts: జింబాబ్వేలో సంజూకు అభిమానులు ఫిదా, కేన్సర్ బాధిత బాలుడిని కలిసిన సంజూ శామ్సన్
Sanju Wins Fans Hearts: టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శామ్సన్ అభిమానుల హృదయాల్ని గెల్చుకున్నాడు. కేన్సర్‌తో పోరాడుతున్న బాలుడిని కలిసిన శామ్సన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Sanju Wins Fans Hearts: టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శామ్సన్ అభిమానుల హృదయాల్ని గెల్చుకున్నాడు. కేన్సర్‌తో పోరాడుతున్న బాలుడిని కలిసిన శామ్సన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సంజూ శామ్సన్ తన దయార్ధ హృదయంతో అభిమానుల హృదయాల్ని గెల్చుకున్న ఘటన జింబాబ్వేలో జరుగుతున్న ఇండియా వర్సెస్ జింబాబ్వే రెండవ వన్డే సందర్భంగా చోటుచేసుకుంది. కేన్సర్‌తో పోరాడుతున్న ఓ ఆరేళ్ల బాలుడికి మ్యాచ్ బాల్‌పై సంజూ శామ్సన్ సంతకం చేసివ్వడంతో అక్కడి స్థానికుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
27 ఏళ్ల కేరళకు చెందిన సంజూ శామ్సన్‌కు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ కొన్నిసార్లు అదృష్టం కలిసిరాక, మరి కొన్నిసార్లు స్వయం తప్పిదాల కారణంగా టీమ్ ఇండియా క్రికెట్‌కు దూరంగానే ఉన్నాడు. కానీ జింబాబ్వే పర్యటనలో మాత్రం ఉన్నాడు. రెండవ వన్డేలో 39 బంతుల్లో 43 పరుగులు చేసి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇందులో 3 పోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా 3 క్యాచెస్ కూడా తీసుకున్నాడు.
అయితే ఈ ప్రదర్శనతో కాకుండా మానవత్వం, దయార్ధ హృదయంతో అభిమానుల హృదయాల్ని గెల్చుకున్నాడు సంజూ శామ్సన్. జింబాబ్వేకు చెందిన కేన్సర్‌తో బాధపడుతున్న ఓ ఆరేళ్ల బాలుడు ఇండియా వర్సెస్ జింబాబ్వే రెండవ వన్డే చూసేందుకు వచ్చాడు. ఆ సందర్భంగా మ్యాచ్ బాల్‌పై సంజూ శామ్సన్ సైన్ చేసి బాలుడికివ్వడమే కాకుండా ఈ ఘటన తనకెంతో ఆనందాన్నిచ్చిందని వ్యాఖ్యానించాడు. సంజూ మానవత్వం, దయార్ధ హృదయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో సంజూ శామ్సన్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. తమ అభిమాన క్రికెటర్‌కు మద్దతుగా చాలామంది అక్కడికి చేరుకుని బ్యానర్లు కూడా ప్రదర్శించారు. అదే సమయంలో సంజూ..సంజూ అంటూ కోరస్ కూడా ఇవ్వడం విశేషం.
Also read: KL Rahul: కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు..అతడో క్లాస్ ప్లేయర్ అన్న మాజీ ఆటగాడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook