T10 League 2021 Coaches: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
T10 League 2021 Coaches: టీ10 లీగ్ ఐదో సీజన్ లో అబుదాబి ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఫ్రాంచైజీ క్రికెట్లో ఓ మహిళా క్రికెటర్ తమ టీమ్ కు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనుంది. తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్‌ను (Sarah Taylor Coach) నియమిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
T10 League 2021 Coaches: టీ10 లీగ్ ఐదో సీజన్ నిర్వహణకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో టీమ్ అబుదాబి చారిత్రక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ చరిత్రలో ఓ పురుషుల జట్టుకు తొలిసారిగా మహిళా క్రికెటర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజీ పేర్కొంది. మాజీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్ (Sarah Taylor Coach).. టీమ్ అబుదాబికి అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైనట్లు ట్విట్టర్లో వెల్లడించింది.
"చరిత్ర సృష్టించాం. ఐదో సీజన్ టీ10 లీగ్ నేపథ్యంలో సారా టేలర్‌ను అబుదాబి జట్టుకు (Abu Dhabi Team T10) కోచ్‌గా నియమిస్తున్నాం. ఫ్రాంచైజీ క్రికెట్లో ఓ పురుషుల క్రికెట్ జట్టుకు మహిళ కోచ్‌గా ఎంపికవడం ఇదే తొలిసారి" అని అబుదాబి ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది.
సారా టేలర్.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు (Sarah Taylor Retirement) పలికింది. తన క్రికెట్ కెరీర్లో సారా.. ఇంగ్లాండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఉత్తమ మహిళా వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ రాణించింది.
అబుదాబి ఫ్రాంచైజీలో కీలక ఆటగాళ్లు..
టీమ్ అబుదాబిలో (Abu Dhabi Team T10) క్రిస్ గేల్, లివింగ్‌స్టోన్, పాల్ స్టిర్లింగ్ వంటి కీలక ఆటగాళ్లున్నారు. వీరితో పాటు లాంగే, మెక్కాయ్, కొలిన్ ఇంగ్రామ్, డానీ బ్రిగ్స్, ఫైడల్ ఎడ్వర్డ్స్, నవీన్ ఉల్ హక్ ఉన్నారు. నవంబర్ 19 నుంచి ఈ టీ10 లీగ్ ప్రారంభం (T10 League 2021 Schedule) కానుంది.
Also Read: Warner imitate Ronaldo: రొనాల్డోను అనుకరించిన డేవిడ్ వార్నర్- ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వులు!
Also Read: David Warner IPL Auction: ‘సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నన్ను రిటైన్ చేసుకోవడం కష్టమే‘
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook