West Indies Smash World Record 25 Runs In Super Over: క్రికెట్ ఆటలో ఓ మ్యాచ్ 'సూపర్ ఓవర్‌' వరకు వెళ్లడం చాలా తక్కువ. ఒకవేళ వెళ్లినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భారీ పరుగులు చేయలేరు. ఎందుకంటే.. సూపర్ ఓవ‌ర్‌లో అప్పటివరకు మంచి ఫామ్‌లో ఉన్న బౌలర్ బౌలింగ్ చేస్తారు కావున.. బ్యాటర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. అలాంటి ఒత్తిడిని జయించిన మహిళా ప్లేయర్స్ రికార్డు స్థాయిలో పరుగులు చేశారు. సూపర్ ఓవ‌ర్‌లో ఏకంగా 25 పరుగులు చేసి ఔరా అనిపించారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా జోహన్నెస్‌బర్గ్ వేదిక‌గా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మహిళా జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. విండీస్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో 160 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ సునే లూస్ 46 పరుగులు చేసి జట్టును ఆడుకుంది. బౌలింగ్ వేసిన విండీస్ ప్రతి బౌల‌ర్ తలో రెండు వికెట్లు తీశారు. అనంత‌రం 161 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన విండీస్ కూడా 160 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓపెనర్ దియాంద్రా డాటిన్ 37 పరుగులు చేసింది. ఆయబొంగ ఖాకా 5 వికెట్లు తీసుకుంది. 


మ్యాచ్ టైగా ముగియడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్‌కు వెళ్లారు. సూపర్ ఓవ‌ర్‌లో విండీస్‌ క్రికెటర్లు దియాంద్ర డాటిన్ (19; 5 బంతుల్లో 2x4, 2x6), హేలీ మాథ్యూస్‌ (6; 1 బంతి 1x6) దక్షిణాఫ్రికా బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మేయిల్‌కు చుక్కలు చూపించారు. తొలి బంతికి డాటిన్‌ రెండు పరుగులు తీయగా.. ఆ తర్వాత రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌, మూడు పరుగులు చేసింది. చివరి బంతికి హేలీ మరో సిక్సర్‌ బాదంతో ఆ ఓవ‌ర్‌లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి.



సూపర్‌ ఓవర్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్‌ షబ్నిమ్‌ మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసింది. కేవలం 3.65 ఎకానమీతో పరుగులు ఇచ్చింది. కానీ విండీస్‌ బ్యాటర్లు సూపర్‌ ఓవర్‌లో దంచికొట్టడంతో ఆమె చేతులెత్తేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 17 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. క్లో ట్రియాన్‌ (7), తజ్మిన్‌ బ్రిట్స్‌ (10) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. సూపర్ ఓవ‌ర్‌లో 25 పరుగులు వన్డే ఫార్మాట్‌లో పురుషులు కూడా చేయలేదు. అయితే టీ20లో మాత్రం విండీస్ 25 రన్స్ చేసింది. 


Also Read: Union Budget 2022: ముగిసిన ఆర్ధిక మంత్రి ప్రసంగం.. బడ్జెట్ 2022లోని హైలైట్స్ ఇవే!!


Aslo Read: Budget 2022: బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిపోనున్న పోస్టాఫీసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook