మిస్టర్ 360 షాకింగ్ నిర్ణయం: అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మరియు సూపర్ స్టార్ బ్యాట్స్ మెన్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
AB de Villiers Announces Retirement From all Forms of Cricket: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మరియు సూపర్ స్టార్ బ్యాట్స్ మెన్ మిస్టర్ 360, ఏబీ డివిలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక అన్ని క్రికెట్ ఫార్మాట్ ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 10 సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తరపున ఆడిన ఏబీకి భారత్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు.
2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డివిలియర్స్, 2011లో ఆర్‌సీబీలో చేరి, 28 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డి 4491 పరుగులు చేసి, బెంగుళూరు ఐదుసార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read: 'డ్రెస్ ఏమో కానీ ముందు బ్రా వేసుకో'.. బాలీవుడ్ భామను ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
"ఇదొక అద్భుతమైన ప్రయాణం, కానీ నేను అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను.
పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి.. ఇప్పటి వరకు స్వచ్ఛమైన ఆనందంతో... హద్దులేని ఉత్సాహంతో క్రికెట్ ఆడాను... ప్రస్తుతం నా వయసు 37 సంవత్సరాలు దాటింది.. ఈ వయసులో ఇది వరకటిలా కసితో క్రికెట్ ఆడలేనేమో అందుకే రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా" అని ట్విట్టర్లో భావొద్వేకంగా పోస్ట్ చేసాడు
Also Read: వావ్: గూగుల్ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్
ఏబీడి ప్రకటనతో అతడి అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు ఏబీడి ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు. ఈ విషయంపై రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు కూడా స్పందించింది.
"ఒక శకం ముగిసింది! ఏబీ నీలా ఎవరు లేరు.. మేము మిమ్మల్ని ఎంతో మిస్ అవుతాము.. మీరు రెడ్ హార్ట్ టీమ్ కు చేసిన కృషి, అభిమానులకు, టీమ్ కు అందించిన వాటన్నిటికీ చేతులు జోడించి.. #ThankYouAB.. రిటైర్మెంట్ శుభాకాంక్షలు, లెజెండ్!" అంటూ రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు యాజమాన్యం స్పందించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook