Scott Boland 6 wickets helps Australia beat England in Boxing Day Test: ప్రతిష్టాత్మక యాషెస్‌ (Ashes) 2021-22 ఆస్ట్రేలియా (Australia) కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌ (England)తో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 68 పరుగలకే ఆలౌట్‌ చేసి.. ఇన్నింగ్స్‌ 15 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆసీస్ అరంగేట్ర పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌ (Scott Boland-6/7) రెండో ఇన్నింగ్స్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. ఇక ఇంగ్లండ్‌ పేలవ ఆటతీరు కారణంగా బాక్సింగ్‌ డే టెస్టు (Boxing Day Test) మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. వరుసగా మూడు టెస్టులు గెలిచిన ఆసీస్ యాషెస్‌ సిరీస్‌ను దక్కించుకుంది. స్కాట్‌ బోలాండ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31/4 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్.. వరుసగా వికెట్లు కోల్పోయింది. స్కాట్‌ బోలాండ్‌ దాటికి ఒక్క ఇంగ్లీష్ బ్యాటర్ కూడా క్రీజులో నిలవలేకపోయాడు. బోలాండ్‌ సహా స్టార్క్, గ్రీన్ కూడా రెచ్చిపోవడంతో మూడో రోజు మరో 37 పరుగులే జోడించిన ఇంగ్లండ్ మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ జో రూట్‌ (28), బెన్‌ స్టోక్స్‌ (11) టాస్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇంగ్లండ్ 27.4 ఓవర్లలో 68 పేరుగలకు ఆలౌట్ అయింది. 


Also Read: Children Vaccination: చిన్నారులకు టీకా.. మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం! ఆధార్ లేకుంటే..!!


ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 65.1 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్‌ జో రూట్‌ (JOe Root-50) హాఫ్ సెంచరీ చేయగా.. జానీ బెయిరిస్టో 35 రన్స్ చేశాడు. ఒలి రాబిన్సన్ 22 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్, నాథన్ లియోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా (Australia) తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు చేసింది. ఓపెనర్ మార్కస్ హారిస్ (75) హార్డ్ సెంచరీ చేశాడు. డేవిడ్ వార్నర్ 38, ట్రావిస్ హెడ్ 27 పరుగులు చేశారు. ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్ 4 వికెట్లు పడగొట్టాడు. 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ (England) 68 పరుగలకే ఆలౌట్‌ అయింది. 


Also Read: Jalianwala Bagh: 102 ఏళ్ల తరువాత ప్రతీకారమా..అసలేం జరిగింది






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి