కోలోకతా: ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ పై 50 పరుగుల తేడాతో కోహ్లీ సేన బంపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ( 92 పరుగులు) రాణించడంతో భారత్ 252 పరుగులు సాధించింది. బౌలింగ్ విభాగంలో చైనా మ్యాన్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌ (3/54)కి తోడు భువి (2) చాహల్ (2) పాండ్యా (2)లు  విజృంభించడంతో ఆసీస్ పతనం అనివార్యమైంది.  టార్గెట్ కష్టసాధ్యం కానప్పటికీ ..భారత స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఇబ్బంది పడ్డారు. ఆసీస్ బలహీనతను పసిగట్టిన టీమిండియా బౌలర్లు తమ ప్రతాపం చూపించారు. ఫలితంగా 43.1 ఓవర్లలో 202 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. దీంతో ఈ సిరీస్ లో కంగారులు మరో ఓటమిని చవిచూసినట్లయింది. కాగా ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుల్దీప్ ధాటికి కంగారులు చిత్తు


ఆసీస్‌తో జరిగిన మ్యాచ్ లో మిగతా వాళ్ల ప్రదర్శన ఒక ఎత్తు ... ఎత్తు కుల్దీప్ బౌలింగ్ ఓ ఎత్తు. కీలక దశలో బౌలింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన కుల్దీప్ తన చౌనా మెన్ బౌలింగ్‌తో ఆసీస్ వెన్ను విరిచాడు. కుల్దీప్ రాకముందుకు విజయంపై ఆసీస్ ఆశలు పెట్టుకుంది..అయితే చైనామెన్ రంగ ప్రవేశంతో సీన్ మారిపోయింది. కుల్దీప్ హ్యాట్రిక్ తో విజృంభించడంతో ఆసీస్ పతనం అనివార్యమైంది. కాగా ఈ మ్యాచ్ లో  54 పరుగులు ఇచ్చి కుల్దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా వన్డేల్లో భారత తరఫున హట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు.