Taapsee Pannu, Mithali Raj's Shabaash Mithu teaser: భారత మహిళా వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ త్వరలో వెండితెరపై సందడి చేయనున్న విషయం తెలిసిందే. భారత జట్టుతో మిథాలీ 23 ఏళ్ల ప్రయాణంను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. మిథాలీ బయోపిక్ 'శభాష్‌ మిథు'‌లో స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నటిస్తున్నారు. దర్శకుడు రాహుల్ ధోలాకియా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది. శభాష్‌ మిథు సినిమా కోసం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శభాష్‌ మిథు టీజర్‌ను ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీమిండియా మాజీ హెడ్ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత అయిన రవిశాస్త్రి వాయిస్‌తో టీజర్‌ ఆరంభం అవుతుంది. 'లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్.. నిలకడకు మారుపేరు, కెప్టెన్' అంటూ రవిశాస్త్రి చెప్పారు. మిథాలీ రాజ్‌ రికార్డుల గురించి వ్యాఖ్యాతలు చెబుతుండగా.. తాప్సీ డ్రెసింగ్ రూంలో పాడ్స్ కట్టుకుని, గ్లవ్స్ తొడుక్కుని, బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉంటుంది. చివరకు మైదానంలో షాట్ ఆడుతున్న తాప్సీని చూపించడంతో టీజర్‌ ఎండ్ అవుతుంది. 


శభాష్‌ మిథు టీజర్‌ను తాప్సీ పన్ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. 'ఈ జెంటిల్‌మెన్ క్రీడలో ఆమె చరిత్రను తిరగరాయడానికి బాధపడలేదు. బదులుగా ఆమె చరిత్రను సృష్టించింది' అని తాప్సీ పేర్కొంది.  '#AbKhelBadlega #ShabaashMithu త్వరలో వస్తుంది. #BreakTheBias #ShabaashMithu #ShabaashWomen #ShabaashYou' అనే హ్యాష్ టాగ్స్ జోడించింది. శభాష్‌ మిథు టీజర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Taapsee Pannu (@taapsee)


1999లో 16 ఏళ్ల వ‌య‌సులో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదారు. అదే 19 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి.. టెస్టుల్లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కురాలిగా అరుదైన గుర్తింపు సాధించారు. వన్డేల్లో 7 వరుస హాఫ్ సెంచరీలు, 4 ప్రపంచకప్‌లలో కెప్టెన్సీ లాంటి ఎన్నో రికార్డులు ఆమె పేరుపై ఉన్నాయి. 23 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. మిథాలీ భారత్ తరఫున 12 టెస్టులు, 230 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7737, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా 8 సెంచరీలు చేశారు.


Also Read: Viral Video: అర్ధరాత్రి 10 కి.మీ. పరుగెత్తుతున్న యువకుడు.. స్టార్ డైరెక్టర్ లిఫ్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు! కారణం ఏంటంటే?


Also Read: Viral News: వొడ్కా బాటిల్‌లో పూజా ఆయిల్.. వైరల్ అవుతోన్న ఫోటో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook