Shahid Afridi said ICC wants to play India in T20 World Cup 2022 Semi Final: టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌పై భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం గ్రూప్ 2లో సెమీస్‌ రేసు ఆసక్తికరంగా ఉంది. రెండు స్థానాల కోసం భారత్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ రేసులో ఉన్నాయి. బంగ్లాపై విజయం సాధించిన రోహిత్ సేన 6 పాయింట్లతో ఈ రేసులో ముందంజలో ఉంది. రెండు మ్యాచులు ఓడిన పాక్ రేసులో కాస్త వెనకబడి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్, బంగ్లాదేశ్‌ మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 64 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్సర్‌) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం వర్షం కారణంగా బంగ్లా లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151కి కుదించగా.. 6 వికెట్లు కోల్పోయి 145 రన్స్‌ చేసి ఓడిపోయింది. లిటన్‌ దాస్‌ (27 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినా బంగ్లాకు ఓటమి తప్పలేదు. 


భారత్‌ చేతిలో ఓటమిపాలైన బంగ్లాదేశ్‌ ప్లేయర్స్, ఫాన్స్ సాకులు వెతికారు. విరాట్ కోహ్లీ ఫేక్‌ ఫీల్డింగ్, వర్షం పడకుంటే తామే గెలిచేవాళ్ళం అంటూ నెట్టింట సాకులు చెప్పారు. అయితే భారత్ విజయంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఛాన్స్‌లు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది ఐసీసీపై తీవ్ర ఆరోపణలు చేశాడు. భారత్‌ను ఎలాగైనా సెమీస్‌లో ఆడించాలని ఐసీసీ చూసిందని.. అందుకే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్లతో జరిగిన మ్యాచుల్లో రోహిత్ సేనకు అనుకూలంగా నిర్ణయాలు వెలువరించిందని ఆరోపించాడు. 


'బంగ్లాదేశ్‌, భారత్‌ మ్యాచ్‌ను ఓ సారి పరిశీలిస్తే.. వర్షం వల్ల అవుట్‌ ఫీల్డ్‌ చాలా చిత్తడిగా ఉంది. అయినా భారత్‌కు ఐసీసీ అనుకూలంగా వ్యవహరించింది. ఎలాగైనా భారత్‌ సెమీస్‌లో ఆడించాలన్నదే ఐసీసీ ద్యేయం. బంగ్లాతో మ్యాచ్‌లో  వర్షం ఆగిపోగానే.. వెంటనే మ్యాచ్ ప్రారంభించడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయి. ఏదేమైనా లిటన్‌ దాస్‌ బాగా బ్యాటింగ్‌ చేశాడు. బంగ్లా వికెట్లు కోల్పోకపోతే తప్పకుండా గెలుస్తుందని 6 ఓవర్ల తర్వాత మేమంతా భావించాం. పరిస్థితులు కలిసి రాలేదు. అయినా కూడా బంగ్లా బాగా పోరాడింది. ఇక భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించినవారికి ఉత్తమ అంపైరింగ్‌ అవార్డులు ఇవ్వాలి' అని షాహిద్ అఫ్రిది విమర్శలు చేశాడు. 


Also Read: Mehreen Pirzada: మాల్దీవ్స్ పర్యటనలో మెహ్రీన్.. పొట్టి డ్రెస్‌లో సెగలు రేపుతోందిగా!


Also Read: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌తో తలపడే జట్టు అదే.. రికీ పాంటింగ్‌ జోస్యం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook