Shahid Afridi says Biggest cricket market is India: ప్రపంచ క్రికెట్‌లో సంపన్న బోర్డు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ). స్టార్ క్రికెటర్లు ఉండడం ఓ కారణం అయితే.. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరో కారణం. ఐసీసీకి కూడా బీసీసీఐ నుంచే భారీ స్థాయిలో ఆదాయం వెళుతుంది. అందుకే ప్రస్తుతం ఐసీసీని కూడా శాసించే స్థితిలో బీసీసీఐ ఉంది. ధనిక బోర్డుగా ఉండడానికి కారణం ఐపీఎల్ కూడా మరో కారణం. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం (2023-27) 48 వేల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందంటే క్రేజ్ ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోట్లు కుమ్మరించే ఐపీఎల్‌లో భాగం కావడానికి ఇతర దేశాల క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా దూరమవుతున్నారన్న సంగతి తెలిసిందే. అందుకే తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నీకి ఉన్న ఆదరణ దృష్ట్యా.. మెగా లీగ్ కోసం ఐసీసీ ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ) క్యాలెండర్‌లో భాగంగా రెండున్నర నెలల పాటు ప్రత్యేకంగా ఓ షెడ్యూల్‌ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్‌ క్రికెట్‌పై పెను ప్రభావం చూపుతుందనే వార్తలు వస్తున్నాయి. 


భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న వివాదాల కారంగా ఐపీఎల్‌లో పాక్ ప్లేయర్స్ ఆడడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐసీసీ ఎఫ్‌టీపీ క్యాలెండర్ (మ్యాచ్‌ షెడ్యూల్స్‌) కూడా ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్‌ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ శాసించే స్థాయికి భారత్ చేరిందని, బీసీసీఐ ఏం చెబితే క్రికెట్‌ ప్రపంచంలో అదే జరగుతుందన్నాడు.


గేమ్ సెట్ మ్యాచ్ పేరిట పాకిస్తాన్ టీవీ ఛానల్ సమా నిర్వహించిన ఓ టాక్‌ షోలో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ... 'క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ శాసించే స్థాయిలో భారత్ ఉంది. క్రికెట్‌ ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్‌ ఇండియాదే. కాబట్టి భారత్ ఏం చెబితే అదే జరుగుతుంది. మార్కెట్‌ వ్యూహాలు, ఎకానమీలో ఇదంతా ఒక భాగం' అని అన్నారు. ఐపీఎల్ కొనసాగుతున్న సమయంలో ఇతర జట్లు అంతర్జాతీయ టోర్నమెంట్లను కూడా వాయిదా వేసుకోవడమో లేదా రీషెడ్యూల్ చేసుకోవడమో జరుగుతోందని, క్రికెట్‌పై భారత్ సాధించిన ఆధిపత్యానికి ఇది నిదర్శనం అని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ఒక అద్భుతమైన వేదిక అని, ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే అనుభవం ఇక్కడ పొందడం అమూల్యమైనదన్నాడు.


Also Read: Funny Video: యజమానిని ఓ ఆటాడుకున్న గొర్రె, గాడిద.. డాంకీ చేసిన పని చూస్తే ఏడ్చే వ్యక్తి కూడా నవ్వుతాడు!


Also Read: Indian Navy Jobs: భారత నావికాదళంలో భారీగా అప్రెంటిస్ పోస్టుల భర్తీ, చివరి తేదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook