తన భార్య చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ డిమాండ్ చేశారు. ఆదివారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ..‘రోజు రోజుకి నాపై ఆరోపణలు పెరుగుతున్నాయి. వీటి గురించి ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదు. నా భార్య చేస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని మాత్రమే కోరుతున్నాను' అన్నారు.  బీసీసీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు షమీ. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం వారే నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్‌ లేదు’ అని షమీ తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షమీ తనపై హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు అని ఆయన భార్య ఫిర్యాదు చేసిన తర్వాత..  మీడియాకు దూరంగా ఉన్న షమీ తాజాగా ఏఎన్‌ఐ మీడియాతో పైవిధంగా స్పందించారు. షమీపై వ్యతిరేకంగా ఏడు ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన తరువాత నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఆయనపై జారీ చేశారు. ఇక ఆయన భార్య హసిన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలతో బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో 27 ఏళ్ల షమీ స్థానం కోల్పోయారు.


షమీ వివాహేతర సంబంధాల గురించి అతని భార్య హసిన్‌ జహాన్‌ గుట్టు విప్పినప్పటి నుంచి ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారం ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం తీవ్రంగా మారింది. గృహ హింస చట్టం,అత్యాచార యత్నం, వేధింపులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద క్రికెటర్‌ మహ్మద్‌ షమీపై కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని జహాన్ సంచలన ఆరోపణలు చేశారు.