Shikhar Dhawan: వన్డే జట్టులో దక్కని చోటు.. ఇక శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్లేనా?
IND vs SL, Is Shikhar Dhawan Cricket Career End. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఇక గబ్బర్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Is Shikhar Dhawan Career Over after dropped from India vs Sri Lanka ODI squad: స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లను భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. లంకతో టీ20 సిరీస్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ దూరమయ్యారు. విశ్రాంతి అనంతరం రోహిత్, రాహుల్, కోహ్లీలు వన్డే సిరీస్‌కు తిరిగి రానుండగా.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు మాత్రం వన్డే జట్టులో చోటు దక్కలేదు. బంగ్లాదేశ్ సిరీస్‌లో సారథిగా వ్యవహరించిన గబ్బర్.. లంకతో సిరీస్‌లో ఉండకపోవడం గమనార్హం.
టెస్ట్, టీ20లకు ఎప్పుడో దూరమైన శిఖర్ ధావన్.. వన్డేలలో మాత్రం చోటు దక్కించుకుంటున్నాడు. సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో కొన్ని సిరీస్‌ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన ధావన్‌పై బీసీసీఐ సెలక్టర్లు వేటు వేశారు. దాంతో 2023 ఆరంభంలో లంకతో వన్డేలకు జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. 2023 ప్రపంచకప్ ఆడి కెరీర్ ముగిద్దామనుకున్న ధావన్‌కు నిరాశ తప్పలేదు. లంకతో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో.. ఇక గబ్బర్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వన్డే ఫార్మాట్‌లో శిఖర్ ధావన్ 167 మ్యాచ్‌లు ఆడి 44.11 సగటుతో 6793 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐసీసీ టోర్నమెంట్‌లలో మంచి ప్లేయర్‌గా పేరున్న ధావన్.. వన్డే ప్రపంచకప్‌లో భారతదేశం తరఫున అత్యంత ఫలవంతమైన ఓపెనర్‌లలో ఒకడు. ఐసీసీ టోర్నమెంట్‌లలో 10 మ్యాచ్‌లలో 537 పరుగులు చేశాడు. ఇక గబ్బర్ 34 టెస్టులో 2315 రన్స్, 68 టీ20లలో 1759 పరుగులు చేశాడు.
లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.
Also Read: UP Fire Accident: యూపీలో అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!
Also Read: Earthquake In Uttarakhand: ఉత్తరకాశీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదు! నేపాల్‌లో కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.