Shikhar Dhawan divorce: శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకులు.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా Ayesha Mukherjee వెల్లడి
Shikhar Dhawan divorce with Ayesha Mukherjee: ఆయేషా ముఖర్జీకి ఇలా విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి (Ayesha Mukherjee first marriage) చేసుకున్న ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాకా అతడితో విడాకులు తీసుకుంది.
Shikhar Dhawan divorce with Ayesha Mukherjee: శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడిపోయారు. శిఖర్ ధావన్‌తో విడాకుల వ్యవహారాన్ని ఆయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా ప్రకటించింది. ఆయేషా ముఖర్జీకి ఇలా విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి (Ayesha Mukherjee first marriage) చేసుకుంది. అతడితో కలిసి వైవాహిక బంధానికి గుర్తుగా ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. 2000 లో ఆలియాకు జన్మనిచ్చిన ఆయేషా.. 2005లో రియాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆయేషా అతడితో విడాకులు తీసుకుంది.
Ayesha Mukherjee marriage with Shikhar Dhawan: శిఖర్ ధావన్‌తో ఆయేషా ముఖర్జీ పెళ్లి
శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీలకు 2009లో ఎంగేజ్‌మెంట్ జరగ్గా 2012 లో వివాహం జరిగింది. ఆయేషాను పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. ఆమెకు మొదటి వివాహంతో కలిగిన ఇద్దరు సంతానాన్ని కూడా తన బిడ్డలుగానే చేరదీశాడు. శిఖర్ ధావన్, ఆయేషాలకు ఓ కొడుకు పుట్టాడు.
Who is Ayesha Mukherjee : ఆయేషా ముఖర్జీ నేపథ్యం
పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఆయేషా ముఖర్జీ (Shikhar Dhawan's wife Ayesha) కుటుంబం ఆమె 8 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లి స్థిరపడింది. కిక్ బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందిన ఆయేషా ముఖర్జీ.. కిక్‌బాక్సర్‌గా గుర్తింపు పొందింది.
Also read : IND vs ENG: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తి, కెప్టెన్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకంటే..
శిఖర్ ధావన్‌తో (Shikhar Dhawan) విడాకుల గురించి సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టిన ఆయేషా.. ఆ పోస్టుల్లో విడాకులు (Divorce) అనే పదానికి తాను అనుకుంటున్న అర్థం గురించి, విడాకుల గురించి చాలానే రాసుకొచ్చింది. బంధాలు (Relationships) మారిపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయని ఆయేషా తన పోస్టులో పేర్కొంది.
మరోవైపు టీమిండియా క్రికెటర్‌గా బిజీగా ఉన్న శిఖర్ ధావన్.. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో (Shikhar Dhawan, T20 world cup) ఆడబోయే టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. కెఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లతో ధావన్‌కి పోటీ తప్పేలా లేదని సీనియర్ క్రికెటర్ అభిప్రాయపడుతున్నారు.
Also read : Aamir khan, kiran rao divorce: అమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook