ఆసియా కప్ 2018: శిఖర్ ధవన్ 14వ సెంచరీ
ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా నేడు జరుగుతున్న 4వ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడుతున్న భారత జట్టు ధీటైన ప్రదర్శన కనబరుస్తోంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శిఖర్ ధవన్ 105 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. శిఖర్ ధవన్ వన్డే ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇది 14వ సెంచరీ కావడం విశేషం. తన సెంచరీతో శిఖర్ ధవన్ ఆసియా కప్ 2018 పోటీలకు శుభారంభాన్ని ఇచ్చాడు. అంతకన్నా ముందుగా బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు 70 బంతుల్లో 60 పరుగులు (4X3, 6X2) చేసి ఎహ్‌సాన్ నవాజ్ బౌలింగ్‌లో స్కాట్ మెక్‌కెంచీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.