లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన 14వ మ్యాచ్‌లో ఆసిస్‌పై టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగిపోయాడు. 95 బంతుల్లో సెంచరీ(4x15)ని పూర్తిచేసి వన్డేల్లో 17వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తనతోపాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. 57 పరుగులు (4x3, 6x1)
చేసి ఔట్ అయినా... రెండో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన కెప్టేన్ విరాట్ కోహ్లీతో కలిసి శిఖర్ ధవన్ ధాటిగా ఆడుతున్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 206కి చేరుకోగా శిఖర్ ధవన్ 112 (103 బంతుల్లో), విరాట్ కోహ్లీ 33 పరుగులు(38 బంతుల్లో) వ్యక్తిగత స్కోర్ వద్ద వున్నారు. శిఖర్ ధవన్ ఊపు చూస్తోంటే గబ్బర్ ఈజ్ బ్యాక్ అనిపిస్తోందని అతడిని అభినందిస్తూ బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది.