Salman Butt Heap Praise on Shubman Gill and Compares Roger Federer: టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్‌ గిల్ న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 రన్స్ చేశాడు. గిల్ ద్విశతకం బాదడంతో భారత్ 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. డబుల్ సెంచరీ బాదడంతో.. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్ మరియు ఇషాన్ కిషన్ సరసన గిల్ చేరాడు. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుబ్‌మన్‌ గిల్ లాంటి ఆటగాడే క్రికెట్‌కు అవసరమని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్ భట్‌ పేర్కొన్నాడు. గిల్ ఆట తీరును టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్‌తో పోల్చాడు. బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'శుబ్‌మన్‌ గిల్ ఆడుతున్న క్రికెట్ విభిన్నమైనది. దాదాపుగా రోజర్ ఫెదరర్ మాదిరిగా ఆడుతాడు. ఫెదరర్ తన షాట్‌లను నాణ్యత మరియు టచ్‌తో ఆడతాడు. గిల్ తన ఆటలో చూపిన మెళకువ ఇంత చిన్న వయసు ఉన్న ఆటగాళ్లలో చాలా అరుదు. గిల్ గొప్పగా ఆడుతున్నాడు' అని అన్నాడు. 


'గతేడాది టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ ఆట చూశాక.. నేను అతడికి అభిమాని అయిపోయా. గిల్ బ్యాటింగ్‌ విధానం, స్టైల్‌ అభినందనీయం. గిల్‌ భారీ స్కోర్లుగా ఎందుకు మలచలేకపోతున్నాడనే ఆందోళన నాకుండేది. ఇప్పుడు అది లేదు. చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే చాలా చిన్న వయసులో ఇలా ఆడతారు. గిల్ కెరీర్‌లో అన్నీ సాధించేశాడని చెప్పను కానీ.. ఇలాగే నిలకడగా కష్టపడుతూ ఉంటే మాత్రం ఉన్నత శిఖరాలకు చేరతాడు. గొప్ప ప్లేయర్ అవుతాడు అని అనుకుంటున్నా' అని సల్మాన్ భట్‌ ధీమా వ్యక్తం చేశాడు.


'కివీస్‌తో తొలి వన్డేలో చివర్లో శుబ్‌మన్‌ గిల్‌ చాలా దూకుడుగా ఆడాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో నిదానంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. కేవలం దూకుడుగానే కాకుండా.. బాధ్యతతో బ్యాటింగ్‌ చేయగలనని నిరూపించుకొన్నాడు. గతంలో సచిన్‌ టెండూల్కర్, మార్క్‌ వా, సయీద్‌ అన్వర్, జాక్వెస్‌ కలిస్‌ కూడా ఇలాగే ఆడేవారు. వారంతా క్రికెట్‌ను వీడిన చాన్నాళ్లకు.. మళ్లీ అలాంటి బ్యాటింగ్‌ సొగసును ఇప్పుడు చూశాను. గిల్‌ను చూడటం చాలా ఆనందంగా ఉంది' అని సల్మాన్ భట్‌ పేర్కొన్నాడు. 


Also Read: Jupiter Rise 2023: బృహస్పతి ఉదయం 2023.. ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు! నోట్ల వర్షం కురుస్తుంది


Also Read: Shani Amavasya Upay 2023: శనిశ్చరి అమావాస్య నాడు ఈ పనులు చేస్తే.. మీపై శని ప్రభావం అస్సలు ఉండదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.