Ind Vs Nz Live Updates: భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్ ఆదివారం మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ మైదానంలో జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2022లో ఓటమిని మరచిపోయి.. రెండు జట్లు కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాయి. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీని నిర్వహిస్తున్న హార్దిక్ పాండ్యాకు న్యూజిలాండ్ టూర్ పరీక్షగా మారనుంది. రెండో మ్యాచ్‌కు వర్షం ఆటంక కలిగించకపోతే శుభ్‌మన్ గిల్ టీ20 అరంగేట్రం చేయడం ఖాయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూజిలాండ్ టూర్ నుంచి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరికీ విశ్రాంతి లభించింది. దీంతో శుభ్‌మన్ గిల్‌కు ఓపెనింగ్‌ అవకాశం దక్కవచ్చు. భారత్ తరఫున గిల్ ఇంకా టీ20 అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎలాంటి బౌలింగ్‌ అటాక్‌నైనా చిత్తు చేయగల టాలెంట్ అతనికి ఉంది. కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్ వైఖరిని మార్చేగల సత్తా ఉన్న ఆటగాడు. 


ఐపీఎల్ 2022లో శుభ్‌మన్ గిల్ చాలా మంచి ఆట తీరును ప్రదర్శించాడు. గత సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 483 పరుగులు చేసి.. గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. పాండ్యా కెప్టెన్సీలోనే గుజరాత్ ఐపీఎల్ టైటిల్ విన్ అయింది. ఇప్పుడు అతడి కెప్టెన్సీలోనే గిల్ టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 


గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా శుభ్‌మన్ గిల్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతోంది. ఈ 23 ఏళ్ల ఆటగాడు భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో దిట్ట. గిల్ భారత్ తరఫున 11 టెస్టు మ్యాచ్‌లు ఆడి 579 పరుగులు.. 12 వన్డేల్లో 579 రన్స్ చేశాడు, ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ టూర్‌లో మంచి ప్రదర్శన చేసి.. ద్వారా, అతను టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాడు. 


భారత్-కివీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. వెల్లింగ్‌టన్‌లో వర్షం ఆగడకుండా వర్షం కురవడంతో అధికారులు బంతి వేయకుండానే రద్దు చేయాలని నిర్ణయించారు. మ్యాచ్‌కి టాస్ కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇరు జట్లు మౌంట్ మౌంగనుయ్ చేరుకున్నాయి. ఇక్కడ కూడా వరుణుడు మరోసారి ప్రతాపం చూపించే అవకాశం ఉండడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. 


Also Read: Ind Vs Nz T20: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 కూడా రద్దు..!  


Also Read: Trending Video: చిన్న స్పెల్లింగ్ మిస్టేక్.. కుక్కలా మారిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి