బాడ్మింటన్ క్రీడాకారులు పివీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లకు ఈఎస్పీఎన్‌ స్పోర్ట్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డులను అందుకోనున్నారు. కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు ‘బెస్ట్‌ కోచ్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. మొదటిసారిగా ఈఎస్‌పీఎన్‌.. పలు విభాగాల్లో క్రీడాకారులకు అవార్డులు ప్రకటించింది. ప్రతిభ ఆధారంగా 11 విభాగాలకు చెందిన క్రీడాకారులను ఈ అవార్డులను ఖరారు చేసింది. అభినవ్‌ బింద్రా, సోమ్‌దేవ్‌, బైచుంగ్‌ భూటియా, జగ్బీర్‌ సింగ్‌, రోహిత్‌ బ్రిజ్‌నాథ్‌, వెంకటేశన్‌ దేవరాజన్‌, నిషా మిల్లట్‌, అపర్ణ పొపట్‌, జగదీశ్‌, మనీషా, అంజుబాబీ జార్జ్‌తో ఉన్న జ్యూరీ బృందం విజేతలను ప్రకటించింది.


గతేడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లను గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్‌ పురుషుల విభాగంలో ‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌-మేల్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం, ఇండియన్‌, కొరియన్‌ ఓపెన్‌ సిరీస్‌ టైటిళ్లను గెలుచుకున్న పివీ సింధు మహిళల విభాగంలో ‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌-ఫిమేల్‌’ అవార్డుకు ఎంపికయింది. కోచ్‌ విషయానికి వస్తే పుల్లెల గోపీచంద్‌ బెస్ట్‌ కోచ్‌ అవార్డును కైవసం చేసుకున్నారు. 13 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ను సాధించిన జాతీయ మహిళా హాకీ టీంకు ‘టీం ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును దక్కింది. ‘మూమెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకోసం జాక్సన్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. ఈ అవార్డు ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. గత ఏడాది భారత్‌లో అండర్‌-17 ఫిఫా ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ఏకైక గోల్‌ను జీక్సన్‌ సింగ్‌ సాధించాడు. ఈ అవార్డు ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈఎస్పీఎన్‌ ఇండియా పురస్కారాలలో భాగంగా రామనాథన్ కృష్ణన్ కు  లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది.