Team India Squad: పొట్టి ప్రపంచకప్‌ గెలిచి జింబాబ్వేపై సిరీస్‌ను సాధించిన భారత జట్టు తర్వాత శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది. ఈనెలఖరులో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ 20, వన్డే సిరీస్‌ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. లంకేయులను ఢీకొట్టేందుకు యువ జట్టునే సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. వన్డేలకు ట్రోఫీని అందించిన రోహిత్‌కే కెప్టెన్సీగా అవకాశం ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Hardik Pandya Divorce: బిగ్‌ బ్రేకింగ్‌.. నటాషాతో విడాకులు తీసుకున్న హార్దిక్‌ పాండ్యా


శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా దూరమవుతుండగా.. రెండు సిరీస్‌లకు  స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ ఆడనుండడం విశేషం. ఇక జింబాబ్వే టీ 20 సిరీస్‌ను చేజిక్కించుకోవడంలో కెప్టెన్‌గా విజయం సాధించిన శుభ్‌మన్‌ గిల్‌కు పదోన్నతి లభించింది. శ్రీలంక టూర్‌కు రెండు సిరీస్‌లకు వైస్‌ కెప్టెన్‌గా గిల్‌కు బాధ్యతలు అప్పగించారు.

Also Read: India vs Zimbabwe: మూడో విజయంతో భారత సంచలన రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్‌|


భారత ప్రధాన కోచ్‌గా వచ్చిన గౌతమ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ జట్టు ఎంపికపై సుదీర్ఘ చర్చలు జరిపారు. టీ 20 ప్రపంచకప్‌, జింబాబ్వే సిరీస్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచకప్‌ తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవాలనుకున్న విరాట్‌, రోహిత్‌ను గంభీర్‌ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో వారిద్దరూ శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 27, 28, 30 తేదీల్లో ఆతిథ్య శ్రీలంకతో మూడు టీ20 bhnemHai మ్యాచ్‌లు జరగనున్నాయి. దేశవాళీ క్రికెట్‌కు వెళ్లి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కింది. కాగా భారత హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌కు తొలి సిరీస్‌ మరి చూడాలి.


టీ 20 సిరీస్‌ జట్టు
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, రిషబ్‌ పంత్‌ (frjuzH jw;kH), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్‌


వన్డే జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్‌ అహ్మద్‌, హర్షిత్‌ రాణా





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి