క్రికెట్ ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయాలు; ముగ్గురూ దేశం విడిచి వెళ్లాలి
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో సంబంధం ఉన్న అస్మిత్, బాన్‌క్రాఫ్ట్, వార్నర్ దక్షిణాఫ్రికా విడిచి వెళ్లాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది.
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో సంబంధం ఉన్న అస్మిత్, బాన్‌క్రాఫ్ట్, వార్నర్ దక్షిణాఫ్రికా విడిచి వెళ్లాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది. ఈ ముగ్గురికి తప్ప ఈ వివాదం గురించి ఎవరికీ తెలియదంది. కోచ్ గా డారెన్ లీమన్‌ను కొనసాగిస్తున్నట్లు ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. ఈ ముగ్గురినీ తక్షణం జట్టు నుంచి తప్పిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ బుధవారమే దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయల్దేరనున్నారు. కాగా సస్పెండ్ అయిన ఆటగాళ్ల స్థానంలో రెన్ షా, బర్న్స్, మ్యాక్స్ వెల్ నాలుగో టెస్టు బరిలోకి దిగుతారని పేర్కొన్నారు.
ట్యాంపరింగ్ ఉదంతం బయటపడ్డ మూడో టెస్టు మధ్యలోనే స్మిత్ నుంచి కెప్టెన్సి బాధ్యతలు చేపట్టిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ టిమ్ పైన్ నాలుగో టెస్టుకు పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ట్యాంపరింగ్ ఉదంతంపై ఆస్ట్రేలియా ప్రధానే స్వయంగా ఆగ్రహం వ్యక్తంచేయడంతో దక్షిణాఫ్రికాకు బయల్దేరి వచ్చిన సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్.. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ విషయాలు చెప్పాడు.
సీఏ అధికారి రాయ్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సదర్లాండ్ స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లదే తప్పని నిర్ధారణకు వచ్చి జట్టు నుంచి వారిని నాలుగో టెస్టు నుంచి తప్పించాడు. అయితే విచారణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ ముగ్గురిపై చర్యలేమీ ప్రకటించలేదు. ఇంకో 24 గంటల తర్వాత తుది నివేదిక వస్తుందని.. దాని ఆధారంగా చర్యలు ప్రకటిస్తామని సదర్లాండ్ తెలిపాడు. బుధవారం లేదా గురువారం వీరిపై చర్యలు తీసుకొనే అవకాశముంది. స్మిత్, వార్నర్‌లపై తీసుకొనే చర్యలను ఐపీఎల్ 2018లో వారు ఆడతారా లేదా అన్నది తేలుతుంది.