కోల్‌కతా: దక్షిణాఫ్రికాతో త్వరలోనే జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు చోటు కల్పించకపోవడంపై టీమిండియా మాజీ కెప్టేన్ సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో స్పందించాడు. ధోనీని తీసుకుంటారని తాను కూడా భావించలేదన్న గంగూలీ.. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ ఎంపికే సరైందని అన్నాడు. అంతేకాకుండా భవిష్యత్ ప్రణాళికబద్ధంగా ఉండాలంటే.. పంత్‌కే ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. "దక్షిణాఫ్రికా సిరీస్‌కు ధోనీని ఎంపిక చేయకపోవడం మీకు ఆశ్చర్యం కలిగించిందా?" అనే ప్రశ్నకు బదులుగా గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 


ధోనీ కూడా యువకుడిగానే జట్టులోకి అడుగుపెట్టాడని గుర్తుచేసిన గంగూలీ... ఏదేమైనా జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీకి ఇది ఒక విధంగా సంకటమైన పరిస్థితిలాంటిదే అని అన్నాడు.