Ganguly on Kohli Captaincy: ఇండియా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని కెప్టెన్​గా తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. రోహిత్​ను కెప్టెన్​గా నియమించడానికి కారణాలేంటో చెప్పాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"బీసీసీఐతో పాటు టీమ్ఇండియా సెలెక్టర్లు ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం ఇది. అంతకు ముందు టీ20 కెప్టెన్​గా తప్పుకోవొద్దని బీసీసీఐ విరాట్​ కోహ్లీని కోరింది. కానీ, అందుకు విరాట్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో టీ20కి ఒక కెప్టెన్, వన్డేకు మరో కెప్టెన్​ అవసరమా? అనే భావన బీసీసీఐకి కలిగింది" బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు.


అయితే టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగుతాడని.. వైట్ బాల్ మ్యాచ్ లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని గంగూలీ స్పష్టం చేశాడు. వన్డే కెప్టెన్​గా విరాట్​ను తొలగించడానికి ముందు అతడితో మాట్లాడినట్లు దాదా చెప్పాడు. సెలెక్టర్లు కూడా విరాట్​తో మాట్లాడినట్లు పేర్కొన్నాడు. ఇన్నాళ్లు కెప్టెన్ గా కొనసాగినందుకు కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు.


ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా వెళ్లనుంది. డిసెంబరు 26న సౌతాఫ్రికా, ఇండియా మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు వన్డేలు జరగనున్నాయి.   


ALso Read: Kohli Fans Fires On BCCI: బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడమే కారణం


Also Read: If Yoga Teacher as Umpire: క్రికెట్ మ్యాచ్ జరగుతుండగా అంపైర్ యోగా చేస్తే?.. వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook