Sourav Ganguly says I like Virat Kohli's attitude: భారత క్రికెట్ జట్టులో గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటివరకు టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు షికార్లు చేశాయి. తాజాగా విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మధ్య దూరం పెరిగినట్టే కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటన (SA Tour)కు ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడిన అనంతరం పలు అనుమానాలకు తావిస్తోంది. వన్డే కెప్టెన్సీ విషయంలో ఇద్దరి మాటలకు అసలు పొంతనే లేకపోవడమే ఇందుకు కారణం. ఈ విషయంలో ఇద్దరు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాలని సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సూచించారు. అయితే తాజాగా కోహ్లీపై దాదా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్‌ కోహ్లీ యాటిట్యూడ్‌ (వ్యక్తిత్వం) అంటే తనకు చాలా ఇష్టమని, అయితే టెస్ట్ కెప్టెన్ బాగా కొట్లాడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. శనివారం గురుగావ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీని రిపోర్టర్స్ పలు ప్రశ్నలు వేశారు. ప్రస్తుత భారత ఆటగాళ్లలో ఎవరి యాటిట్యూడ్‌ అంటే మీకు ఇష్టమని అడగ్గా.. 'నాకు విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌ అంటే చాలా ఇష్టం. కానీ అతడు బాగా కొట్లాడతాడు' అని బదులిచ్చాడు. మీరు జీవితంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. 'జీవితంలో ఒత్తిడి ఉండదు. అయితే భార్య, గర్ల్‌ఫ్రెండ్‌ లాంటివారు మనల్ని ఒత్తిడిలోకి నెడతారు' అని సరదాగా స్పందించారు. 


Also Read: Video: అమృత్‌సర్ గోల్డెన్‌ టెంపుల్‌లో అనూహ్య ఘటన-ఆ వ్యక్తిని కొట్టిన చంపిన భక్తులు


గురువారం దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ బయలుదేరి వెళ్లిన సమయంలో సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. తన మాటలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడిన విరాట్ కోహ్లీ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని, దాన్ని మీడియా వదిలేయాలని కోరారు. 'ఈ విషయంపై నేను చెప్పడానికి ఏమీ లేదు. ఇటీవల వస్తున్న వార్తలను మేము పరిష్కరించుకుంటాము. విరాట్ కోహ్లీ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుంది. ఈ విషయంలో మీడియా కలగజేసుకోవద్దు. అన్ని త్వరలోనే సద్దుమణుగుతాయి ' అని బీసీసీఐ అధ్యక్షుడు పేర్కొన్నారు. దాదా భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. 


Also Read: Kidambi Srikanth: సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌.. సైనా, సింధు తర్వాత!!


దక్షిణాఫ్రికా పర్యటన (SA Tour)కు టెస్టు జట్టు ఎంపిక చేసినప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli)కి బీసీసీఐ (BCCI) షాకిచ్చింది. కోహ్లీని వన్డే సారథిగా తప్పిస్తూ రోహిత్‌ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది. కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించిన తర్వాత వివాదం చెలరేగడంతో గంగూలీ (Sourav Ganguly) మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని చెప్పినప్పుడు తాము వద్దని చెప్పానని అన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు సారథులు ఉండకూడదని సెలక్షన్‌ కమిటీ భావించిందన్నారు. అయితే దాదా చెప్పిన మాటలకు కోహ్లీ చెప్పిన మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దాంతో భారత క్రికెట్‌లో పెద్ద దుమారం చెలరేగింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook