కోల్‌కతా: ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే కాదు ఏ ఇతర క్రీడలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పట్లో ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదని శనివారం మీడియాతో చెప్పారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా ఇంట్లో కూర్చుంటే క్రీడల భవిష్యత్ ఏముంటుందన్నారు. మనుషుల ప్రాణాలు పోతుంటే ఐపీఎల్ ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్న అడుగుతారేంటి అని అసహనం వ్యక్తం చేశారు.  Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఐపీఎల్ నిర్వహించాలని మాకెప్పుడూ ఉంటుంది. అయితే అందుకు తగిన సమయం, సందర్భం ఉంటాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రవాణా రద్దు, విమానాశ్రయాలు మూత పడ్డాయి. ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. బీసీసీఐ అధికారులు సైతం ఐపీఎల్ నిర్వహణకు ఎప్పుడూ సిద్ధమే. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అయితే బోర్డు అధికారులతో మాట్లాడి సోమవారం ఐపీఎల్‌కు సంబంధించి ఏదైనా తాజా సమాచారం ఇస్తానని’ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు.  Rohit Sharma పేరు లేదని షాకయ్యా: లక్ష్మణ్


కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడింది. ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ కొనసాగుతుందని ఆనందించేలోగా, కరోనా కేసులు ఎక్కువయ్యాయని 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ గడువు ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరింత కాలం లాక్‌డౌన్ గడువును పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ప్రకటన వెలువడనుంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo