టీమిండియాకు కోచ్‌గా వస్తా : సౌరబ్ గంగూలి
టీమిండియాకు కోచ్‌గా వ్యవహరిస్తా : సౌరబ్ గంగూలి
తాను తప్పకుండా టీమిండియా కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తానని టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ సౌరబ్ గంగూలీ ధీమా వ్యక్తంచేశాడు. అయితే, అది ఇప్పుడు కాదు భవిష్యత్‌లో అని గంగూలి తేల్చిచెప్పాడు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐపిఎల్‌లో ఢిల్లీ జట్టు సలహాదారుడిగా, క్రికెట్ కామెంటరీ బాధ్యతలతో బిజీగా ఉన్నానని చెబుతూ ఇప్పటికిప్పుడు టీమిండియా కోచ్ పదవిపై అంత ఆసక్తి లేదని గంగూలి స్పష్టంచేశాడు. ఈసారి కాకుండా మరోసారి టీమిండియా కోచ్ పదవికి తాను కూడా దరఖాస్తు చేస్తానని వివరించాడు.
ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవికాలం ముగిసిపోవడంతో అతడిని మరో పర్యాయం కొనసాగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు మీడియాలో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. రవిశాస్త్రిని టీమిండియా కోచ్‌గా ఎంపిక చేసే సమయంలో అప్పటి క్రికెట్ అడ్వైజరి కమిటీకి గంగూలీనే చైర్మన్‌గా వ్యవహరించాడు.