Faf Du Plessis Re Entry: దక్షిణాఫ్రికా అభిమానులకు గుడ్‌న్యూస్ ఇది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ త్వరలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 38 ఏళ్ల స్టార్ ప్లేయర్ 2021లో అనూహ్యంగా జాతీయ జట్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. మళ్లీ జాతీయ జట్టుకు ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డుప్లెసిస్‌ 2020లో ఇంగ్లండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లీగ్‌లలో ఆడుతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇప్పటికే ప్రోటీస్ జట్టు కొత్త వైట్‌ బాల్‌ కోచ్‌ రాబ్ వాల్టర్‌ కలిశాడు. తను జట్టులోకి తిరిగే వచ్చే విషయంపై చర్చించాడు. ఈ విషయంపై డుప్లెసిస్ స్పందిస్తూ.. జట్టులోకి తిరిగి వచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ప్రధాన కోచ్‌తో మాట్లాడినట్లు చెప్పాడు. జట్టులోకి తిరిగి రావడం కేవలం తన గురించే కాదని.. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు కూడా ఎంతో ముఖ్యమని తాను భావిస్తున్నానని అన్నాడు. 


ఈ నెల 16వ తేదీ నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో సఫారీ జట్టు వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం డుప్లెసిస్‌కు జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. సోమవారం జట్టును ప్రకటించనుంది. ఇక డుప్లెసిస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో చెలరేగి ఆడాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్.. 147.6 స్ట్రైక్ రేట్‌తో 369 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 


త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో డుప్లెసిస్ పాల్గొననున్నాడు. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత సీజన్‌లో డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ టాప్‌-4లో నిలిచిన విషయం తెలిసిందే.     ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ కొట్టని ఆర్‌సీబీ.. ఈసారి అయినా ట్రోఫీ ముద్దాడాలని బెంగుళూరు ఫ్యాన్స్‌తో పాటు విరాట్ కోహ్లీ అభిమానులను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


Also Read: Urinated In American Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. మద్యం మత్తులో నిద్రపోతూ..  


Also Read: Zoom Layoffs: జూమ్ సంచలన నిర్ణయం.. ఆకస్మికంగా అధ్యక్షుడికి ఉద్వాసన   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook